Tomato Fish Recipe: సాధారణంగా ఆదివారం వచ్చినా ఏ సెలబ్రేషన్స్‌ చేసుకున్నా చికెన్, మటన్‌ తయారు చేసుకుంటాం. అప్పుడప్పుడు చేపలు కూడా వండుకుంటారు. కానీ, ఎప్పుడైనా బెంగాళీ స్టైల్‌లో టమాట చేపలకూర తయారు చేసుకున్నారా? దీని రుచి అద్బుతంగా ఉంటుంది. ఈ సారి ట్రై చేయండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కావాల్సిన పదార్థాలు..
టమోటాలు- పావుకిలో
చేపలు- 1/2 kg
ఉల్లిపాయ- 1
అల్లం పేస్ట్‌ -2tbsp
ధనియాల పొడి-1 tbsp
ఉప్పు- రుచికిసరిపడా
కొత్తిమీర-1tbsp
యోగర్ట్‌- 2tbsp
ఎర్రమిరపకాయలు -1 tbsp
జిలకర్ర-1/2 tbsp
చక్కెర - 1/2
రీఫైండ్‌ ఆయిల్ - 3 tbsp


టమోట చేపలకూర తయారీకి విధానం..
చేపలను తీసుకువచ్చి శుభ్రంగా కడగాలి. దానికి ఉప్పు, పసుపు వేసి బాగా రుద్ది ఓ పది నిమిషాలపాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్‌లో నీళ్లు తీసుకుని కాస్త నీరు పోసి వేడి చేయాలి. టమాటాలను తలభాగం కట్‌ చేసి గాటు పెట్టి ఆ నీటిలో టమాటాలు వేసి ఓ 30 నిమిషాలపాటు వేడి చేయాలి. చల్లారిన తర్వాత తొక్క తీసి బ్లెండర్లో వేసి పేస్ట్‌ తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలను కూడా సన్నగా తరుగుకోవాలి.


చేపలకూర తయారు చేసుకునే ఒక పెద్ద ప్యాన్‌ తీసుకుని అందులో చేపలు వేసి గోల్డెన్ బ్రౌన్‌ కలర్‌లో వేయించుకోవాలి. కాసేపైన తర్వాత మరోవైపు తిప్పుకుని వేయించుకోవాలి. ఇప్పుడు చెంచా సహాయంతో చేపలను పక్కన తీసి పెట్టాలి.


ఇదీ చదవండి:  లిచీ తింటూ బరువు తగ్గండి.. మరో 5 ఆరోగ్య ప్రయోజనాలు కూడా..!


ఇప్పుడు అదే ప్యాన్‌ మరింత నూనె వేసి ఉల్లిపాయలను ఓ ఐదు నిమిషాలపాటు ఉడికించుకోవాలి. అందులోనే పసుపు, కారం, జిలకర్రపొడి, అల్లంపేస్ట్‌, ధనియాల పొడి, కాస్త చక్కెర, టమాటపేస్ట్‌ కూడా వేసి ఓ ఐదు నిమిషాలపాటు బాగా ఉడికించుకోవాలి. 


ఇదీ చదవండి: మీ జుట్టు స్పీడ్‌గా.. ఒత్తుగా పెరగాలంటే ఈ రసం రాయండి చాలు..


ఆతర్వాత స్టవ్‌పై నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పడే ఈ కూరలో పెరుగు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత చేపలు వేసి ఓ ఐదు నిమిషాలపాటు ఉడికించుకోవాలి. పైనుంచి కొత్తిమీర వేసి బాగా కలపాలి. వేడివేడి అన్నం, చపాతీల్లోకి తింటే రుచి అదిరిపోతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter