Moong Dal For Bad Cholesterol: పెసరపప్పుతో మీ శరీరంలోని కొలెస్ట్రాలను రెట్టింపు వేగంతో కరిగించుకోండి..
Moong Dal For Bad Cholesterol: శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరగడం కారణంగా చాలామంది తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అంతేకాకుండా ఈ కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే మీరు కూడా ఈ సమస్యతో బాధపడితే తప్పకుండా ఈ చిట్కాను పాటించండి.
Moong Dal For Bad Cholesterol: అందరి శరీరాలకు తగిన పరిమాణంలో కొలెస్ట్రాల అవసరమే.. ఈ కొలెస్ట్రాల్ జీవక్రియను ప్రభావంతంగా నడిపించేందుకు సహాయపడుతుంది. అయితే అందరికీ తెలియని విషయమేమంటే.. శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. బాడీలో మంచి కొలెస్ట్రాల్ పెరిగితే ఎంతో మేలు జరుగుతుంది. ఇదే స్థానాల్లో చెడు కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరిగితే అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం చాలామందిలో కొలెస్ట్రాల్ పెరగడం సాధారణ సమస్యగా మారింది. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరిలోనూ చెడు కొలెస్ట్రాల్ రోజురోజుకు వేగంగా పెరుగుతోంది.
అయితే ఈ చెడు కొవ్వు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. చాలామందిలో అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల, ఆధునిక జీవన శైలి కారణంగా కూడా ఈ కొలెస్ట్రాల్ పరిమాణాలు శరీరంలో విపరీతంగా పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ చెడు కొవ్వు పెరగడం కారణంగా శరీరం అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయి చాలామందిలో కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా అధిక రక్తపోటు, గుండెపోటు సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : Loan Application For Defaulters: లోన్ ఎగ్గొట్టిన వాళ్లు మళ్లీ లోన్ కోసం అప్లై చేస్తే వస్తుందా ?
తరచుగా కొలెస్ట్రాల్ కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలకు గురయ్యేవారు ఆరోగ్య నిపుణులు సూచించే పెసరపప్పును ప్రతిరోజు ఆహారాల్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని చెడు కొలస్ట్రాలను నియంత్రించి.. మంచి కొలెస్ట్రాలను పెంచేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా దీని కారణంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తాయి. ఈ పప్పులో ఉండే గుణాలు గుండెను ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి. అంతేకాకుండా శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.
ఈ పప్పులో ఉండే పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్, ఫైబర్, విటమిన్ బి6, విటమిన్ సి, ఫైబర్ పోషకాలు పొట్టను ఎప్పుడు నిండుగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా శరీర బరువును తగ్గించేందుకు కూడా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహం సమస్యలతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా ఈ పప్పును తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కర పరిమాణాలు అదుపులో ఉంటాయని అంతేకాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి : Loan Application For Defaulters: లోన్ ఎగ్గొట్టిన వాళ్లు మళ్లీ లోన్ కోసం అప్లై చేస్తే వస్తుందా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి