How To Remove Pimples: శాశ్వతంగా మొటిమలకు ఇలా 7 రోజుల్లో చెక్ పెట్టండి..
How To Remove Pimples In 7 Days: మొటిమల సమస్యలతో బాధపుడుతున్నవారికి రోజ్ వాటర్ ప్రభావవంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా సులభంగా చర్మ సమస్యల నుంచి ఉపశనం లభిస్తుంది. కాబట్టి చర్మ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ రోజ్ వాటర్‌ను వినియోగించండి.
How To Remove Pimples In 7 Days: ముఖంపై మొటిమల కారణంగా చాలా మంది అందహీనంగా కొడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే చాలా రకాల ప్రోడక్ట్స్‌ను వినియోగిస్తున్నారు. అయితే వీటిని వినియోగించడం వల్ల చాలా రకాల చర్మ సమస్యలు వస్తాయని చర్మ వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి రోజ్ వాటర్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. రోజ్ వాటర్ మొటిమలు, మచ్చల సమస్యలను దూరం చేస్తుందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి రోజ్ వాటర్‌ను ఎలా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజ్ వాటర్, కలబంద:
కలబంద, రోజ్ వాటర్ రెండూ చర్మానికి మేలు చేస్తాయి. ఈ రెండింటిని మిక్స్ చేసి పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ పేస్ట్‌ని అరగంట తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా ప్రతి రోజూ 2 నుంచి 3 సార్లు చేస్తే చాలా రకాల చర్మ సమస్యలు దూరం కావడమేకాకుండా చర్మం గ్లోగా తయారవుతుంది.
రోజ్ వాటర్, ముల్తానీ మిట్టి:
రోజ్ వాటర్, ముల్తానీ మిట్టి చర్మ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే గుణాలు చర్మంపై ముడతలు, మొటిమల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అయితే రోజ్ వాటర్, ముల్తానీ మిట్టి మిశ్రమాన్ని ప్రతి రోజూ ముఖానికి అప్లై చేస్తే మొటిమల సమస్య దూరమవుతుంది.
రోజ్ వాటర్, చందనం:
చందనంలో ఉండే గుణాలు చర్మానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. అయితే రోజ్ వాటర్, చందనం కలిగిన మిశ్రమాన్ని ప్రతి రోజూ ముఖానికి అప్లై చేస్తే మొటిమల సమస్య దూరమవుతుంది. అంతేకాకుండా మొటిమలు, నల్లటి వలయాలు, పొడిబారడం, టానింగ్ వంటివి తొలగిపోతాయి.
సాదా రోజ్ వాటర్:
చర్మం సౌందర్యంగా కనిపించేందుకు రోజ్ వాటర్ ప్రభావవంతంగా సహాయపడతాయి. అయితే ప్రతి రోజూ పడుకునే క్రమంలో కాటన్‌తో రోజ్ వాటర్‌ను మొటిమలు, ఇతర చర్మ సమస్యలున్నవారు అప్లై చేస్తే తొందరలోనే మంచి ఫలితాన్ని పొందుతారు. అంతేకాకుండా ముఖం అందంగా తయారవుతుంది.
రోజ్ వాటర్‌తో మసాజ్ చేయండి:
రోజ్ వాటర్‌తో ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల చర్మానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా చర్మ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read : Ma Bava Manobhavalu : మా బావ మనోభావాలు.. దుమ్ములేపిన బాలయ్య.. దరువేసిన తమన్
Also Read : Top Heroine in 2022 : ఈ ఏడాది బ్యాడ్ లక్ సఖిలు వీళ్లే.. నక్క తోక తొక్కిన హీరోయిన్లు ఎవరంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook