How To Strong Spine: ఎన్ని మందులు వాడిన నడుము నొప్పి తగ్గడం లేదా.. ఇవి తింటే చాలా నొప్పి మటు మాయం..!
How To Strong Spine: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఆహారంపై శ్రద్ధ తీసుకోకపోవడం వల్లే ఇలాంటి సమస్యల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.
How To Strong Spine: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఆహారంపై శ్రద్ధ తీసుకోకపోవడం వల్లే ఇలాంటి సమస్యల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ అనారోగ్య సమస్యల్లో వెన్నెముక బలహీనపడటం ప్రధాన సమస్యగా మారింది. అనారోగ్యకరమైన ఆహారం, కొన్ని రకాల పానీయాల ద్వారా ఈ సమస్యలు వస్తున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే వెన్నెముక బలంగా చేయడానికి పలు రకాల ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పచ్చని ఆకు కూరలు:
పచ్చని ఆకు కూరలలో శరీరానికి అవసరమైన అన్ని రకాల ఔషధాలు లభిస్తాయి. అంతేకాకుండా వెన్నెముకను బలోపేతం చేయడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా బచ్చలికూరను క్రమం తప్పకుండా తినడం వల్ల వెన్నుముకకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి.
నారింజ పండ్లు:
నారింజ పండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి మంచి లాభాలు చేకూరుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు వెన్నెముకను బలంగా చేస్తాయి. కావున ప్రతి రోజూ బత్తాయి, క్యారెట్ వంటివి ఆహారంగా తినాలి.
ఆహారంలో గింజలను తప్పకుండా తీసుకోవాలి:
శరీరాన్ని ఆరోగ్యంగా ఉండడానికి బాదం, వాల్ నట్స్ తీసుకోవాలి. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని బలంగా, శక్తి వంతంగా చేస్తాయి. కావున కాల్షియం అధికంగా ఉండే బాదంపప్పు క్రమం తప్పకుండా తినాలి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: మహిళకు ముద్దులు, హగ్గులు ఇచ్చిన రెండు సింహాలు.. వీడియో చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!
Also Read: Non-Veg in Sawan: శ్రావణమాసంలో ఎందుకు నాన్‌వెజ్ తినకూడదో తెలుసా..?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook