Shravan month 2022: శ్రావణ మాసంలో మాంసం ఎందుకు తినకూడదో తెలుసా..?? దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఉంది!

Shravan month 2022: శ్రావణమాసం (Sravana) జూలై 14 నుంచి ప్రారంభమై ఆగస్టు 12 వరకు కొనసాగనుంది. ఈ మాసం శివునికి ప్రితికరమైన రోజు కావున వారం రోజుల పాటు శివున్ని ఆరాధిస్తారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 14, 2022, 07:10 PM IST
  • శ్రావణమాసంలో నాన్‌వెజ్ తినొద్దు
  • నాన్‌వెజ్ తినకూడదో తెలుసా..?
  • వర్షాకాలంలో జీర్ణశక్తి బలహీనమవుతుంది
Shravan month 2022: శ్రావణ మాసంలో మాంసం ఎందుకు తినకూడదో తెలుసా..?? దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఉంది!

Shravan month 2022: శ్రావణమాసం (Sravana) జూలై 14 నుంచి ప్రారంభమై ఆగస్టు 12 వరకు కొనసాగనుంది. ఈ మాసం శివునికి ప్రితికరమైన రోజు కావున వారం రోజుల పాటు శివున్ని ఆరాధిస్తారు. ఇలా పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. కావున ఈ మాసం మొత్తం మాంసాహారానికి దూరంగా ఉంటారు. అంతేకాకుండా ఇంటి పెద్దలు కూడా నాన్‌వెజ్ తినొద్దని చెబుతారు. అయితే దీనిని పాటించడానికి ప్రధాన కారణాలు మతపరమైన, శాస్త్రీయతేనని నిపుణులు చెబుతున్నారు.  కాబట్టి శ్రావణమాసం (Sravana)లో  నాన్ వెజ్ ఫుడ్ ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

వర్షాకాలంలో జీర్ణశక్తి బలహీనమవుతుంది:

శ్రావణమాసం (Sravana)లో  కురుస్తున్న వర్షాల వల్ల వాతావరణంలో తేమ పెరిగడం వల్ల  మాంసాహర తింటే పొట్టలో సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా నాన్-వెజ్ ఫుడ్ పేగులలో కుళ్లిపోయి ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశాలుంటాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు.

ఆహార పదార్థాలు త్వరగా పాడవుతాయి:

 శ్రావణమాసం (Sravana) లో దేశవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. దీని కారణంగా వాతావరణంలో తేమ ఫంగస్, బూజు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. తద్వార దీని ప్రభావం మాంసాహర ఆహార పదార్థాలపై పడి.. త్వరగా పాడవుతాయి. భారీ వర్షాల కారణంగా వాతావరణంలో తేమ పెరిగి అనారోగ్యకరమైన వ్యాధులు కూడా వ్యాపించే అవకాశాలుంటాయి. కావున తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిదని నిపుణుల సూచిస్తున్నారు.

వానాకాలంలో పక్షులు, జంతువులు అనారోగ్యానికి గురవుతాయి:

వర్షాకాలంలో కీటకాల సంఖ్య అధిక పరిమాణంలో పెరుగుతుంది. కానుక ఇది అనేక రకాల వ్యాధులకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కలుషితమైన వాతావరణంలో జంతులు తిరగడం వల్ల వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారం తింటాయి. దీని వల్ల జంతువులలో కూడా ఇన్ఫెక్షన్లు మొదలవుతాయి. కావున ఈ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జంతువుల మాంసం తినడం వల్ల మనకు కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.

వర్షాకాలంలో చేపలు కూడా తినకూడదు:

వానా కాలంలో సీఫుడ్‌ అరోగ్యానికి హానికరం. ముఖ్యంగా శ్రావణమాసంలో చేపులు, నీటిలో జీవించే ఇతర జీవులు గుడ్లు పెడతాయి. దీని కారణంగా వీటి శరీరంలో  అనేక హార్మోన్ల మార్పులు వస్తాయి.  కావున ఈ సమయంలో సీఫుడ్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అధికమని నిపుణులు చెబుతున్నారు.

వర్షాకాలంలో త్వరగా జీర్ణమయ్యే ఆహారం తినాలి:

వర్షాకాలంలో ఆలస్యంగా జీర్ణమయ్యే సీఫుడ్‌, జంక్‌ఫుడ్‌, నూనెతో కూడిన ఆహారం అస్సలు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ వీటిని తిన్న కొద్ది మోతాదులో  తినడం మంచిది.

Also Read: Pradosh Vrat 2022: ప్రదోష వ్రతం రోజు శివుడిని ఇలా పూజిస్తే...మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News