Coconut Oil For Constipation: ప్రస్తుతం మనలో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యలో మలబద్దం ఒకటి. దీని కారణంగా కడుపు నొప్పి, ఆహారం జీర్ణం అవ్వడకపోవడం, గ్యాస్‌ ఇతర సమస్యలు తలెత్తుతాయి. అయితే ఈ మలబద్దం నుంచి బయటపడడానికి బోలెడు హోం రెమెడీలు ఉన్నాయి. అయితే ఈ చిట్కాలు అన్నీ పాటించిన ప్రేగు కదలికలు మెరుగుపడకపోతే మీరు ఈ నూనెను ఖచ్చితంగా ఉపయోగించాల్సి ఉంటుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొబ్బరి నూనె ఒక సహజ లక్సేటివ్‌గా పనిచేస్తుంది. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థను మృదువుగా చేస్తుంది. మలం కదలికను ప్రోత్సహిస్తుంది అలాగే  మలబద్ధకంతో సంబంధం ఉన్న కడుపు నొప్పి, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. ఈ కొబ్బరి నూనె  ఆయుర్వేదం వైద్యంలో ఒక  ఔషధ గుణాలు కలిగినది. దీని ఉపయోగించడం వల్ల బోలెడు లాభాలు పొందవచ్చు.మలబద్ధకం సమస్యను పరిష్కరించడానికి  ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం.


కొబ్బరి నూనె  ప్రయోజనాలు: 


కొబ్బరి నూనె ఒక సహజ ఔషధం. ఇది మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో, ప్రేగు కదలికలను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనెలోని లారిక్ ఆమ్లం కూడా యాంటీబాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపడంలో సహాయపడతాయి.


నూనె ఎలా ఉపయోగించాలి: 


వంట: 


కొబ్బరి నూనెను వంట నూనెగా ఉపయోగించవచ్చు. వంట చేసేటప్పుడు లేదా సలాడ్లకు డ్రెస్సింగ్‌గా ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల మలబద్దం సమస్య తగ్గుతుంది. 


కడుపుపై కొబ్బరి నూనెతో మసాజ్: 


ముందుగా కొబ్బరి నూనెను వేడి చేసి గోరువెచ్చని నూనెతో కడుపుపైన మసాజ్‌ చేయడం వల్ల ప్రేగుల వ్యవస్థ మెరుగుపడుతాయి. దీని వల్ల తీసుకున్న ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది. 


కొబ్బరి నూనెను వెచ్చని నీటితో: 


వెచ్చని కొబ్బరి నూనెను వేడి స్నానం చేయడం 


వెచ్చని స్నానంలో కొబ్బరి నూనెను జోడించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. దీని వల్ల శరీరం దృఢంగా తయారు అవుతుంది. 


కొబ్బరి నూనెను ఆహారంలో తీసుకోవడం: 


ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను రోజుకు ఒకసారి లేదా రెండుసార్లు తీసుకోవడం లేదా కాఫీ, జ్యూస్‌లో జోడించవచ్చు. 


గమనిక: 


* కొబ్బరి నూనెను అధికంగా తీసుకోవడం వల్ల విరేచనాలు కావచ్చు. 


* మీకు ఏదైనా అంతర్లీన వైద్య పరిస్థితులు ఉంటే, కొబ్బరి నూనెను ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించండి.


* గర్భిణీ లేదా పాలిచ్చే మహిళలు కొబ్బరి నూనెను ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించాలి.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి