How To Control Diabetes: రక్తంలోని చక్కెర పరిమాణాలను నిమిషాల్లో నియంత్రించే ఔషధ గుణాలు కలిగిన డ్రింక్స్ ఇవే..
How To Control Diabetes In 2 Days: మధుమేహం సమస్యతో బాధపడుతున్న వారు ప్రతి రోజు ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ మూడు డ్రింక్స్ ని తాగితే రక్తంలోని చక్కర పరిమాణాలను సులభంగా నియంత్రించుకోవచ్చు. అంతేకాకుండా శరీర బరువును కూడా తగ్గించుకోవచ్చు. ఇంతకుముందు మీరెప్పుడైనా వీటిని ట్రై చేశారా..?
How To Control Diabetes In 2 Days: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు సంభవించడానికి ప్రధాన కారణం మధుమేహమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది 2030 నాటికి మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య ఇప్పుడు ఉన్న వారి కంటే రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయ. కాబట్టి ఈ సమస్యలతో బాధపడుతున్న వారు కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆధునిక జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవడం మంచిదని వారంటున్నారు. చాలామంది మధుమేహానికి గురి కావడానికి ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం కూడా కారణమని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. అంతేకాకుండా చాలామందిలో రక్తంలోని చక్కెర పరిమాణాలు ఆకస్మికంగా పెరుగుతున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
రక్తంలోని చక్కర పరిమాణాలను తగ్గించే పదార్థాలు ఇవే:
కొత్తిమీర విత్తనాలు:
కొత్తిమీర గింజలను కొందరు యాంటీ-డయాబెటిక్ గా కూడా పిలుస్తారు. గింజల్లో ఉండే ఔషధ గుణాలు రక్తంలోని చక్కర పరిమాణాలను నియంత్రించేందుకు సహాయపడతాయి. అయితే దీనికోసం కొత్తిమీర గింజలతో తయారు చేసిన డికాషన్ ప్రతిరోజు తాగాల్సిన ఉంటుంది. దీనిని తాగడం వల్ల శరీర బరువును కూడా సులభంగా నియంత్రించుకోవచ్చు.
Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా
మెంతి గింజలు:
మెంతి గింజల్లో కూడా అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే 4-హైడ్రాక్సీసోసైనేట్ రక్తంలోని గ్లూకోస్ లెవెల్స్ పై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా ఈ గింజల్లో 50 శాతం హైపర్ కూడా లభిస్తుంది. ప్రతిరోజు వీటితో తయారుచేసిన కషాయాన్ని తాకడం వల్ల రక్తంలోని చక్కర పరిమాణం నియంత్రణ ఉంటాయి. అంతేకాకుండా శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలను కూడా తగ్గిస్తుంది.
దాల్చిన:
దాల్చిన చెక్కతో తయారుచేసిన టీ కూడా ప్రభావవంతంగా రక్తం చక్కర పరిమాణాలను నియంత్రించేందుకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి దీనితో తయారుచేసిన దీని ప్రతిరోజూ తాగడం వల్ల మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ టీ ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook