Chikki For Immunity Boosting In Winter Season: చలి కాలంలో  బెల్లం, వేరుశనగలతో తయారు చేసిన చిక్కిలు విచ్చల విడిగా మార్కెట్‌లో లభిస్తాయి. వీటిని తినడానికి ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే వీటిని తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా పిల్లలకైతే శరీర అభివృద్ధికి కూడా సహాయపడుతుంది. అయితే ఇవి మార్కెట్‌లో లభించే వాటి కంటే ఇంట్లో తయారు చేసినవి పిల్లలకు చాలా మంచివి. కాబట్టి వీటిని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కావాల్సిన పదార్థాలు:
>>ఒక కప్పు వేరుశనగలు
>>1 కప్పు బెల్లం ముక్కలు
>>నెయ్యి రెండు చెంచాలు


చిక్కి రెసిపీ తయారి విధానం:
>>ముందుగా వేరు శెనగలను బాణలిలో నెయ్యి లేకుండా వేయించుకోవాలి.
>>వేరుశెనగలు కాస్త చల్లారిన తర్వాత..వాటి తొక్కలను తీసివేసి.. ఒక పాత్రలో తీసుకోవాల్సి ఉంటుంది.
>>ఒక పాన్ తీసుకుని.. అందులో బెల్లం ముక్కలు వేసి, ఇప్పుడు దానికి ఒక చెంచా నెయ్యి వేయాలి.
>>ఇప్పుడు బెల్లం దగ్గర పడ్డాకా పాకంలా తయారవుతుంది.
>>ఇలా తయారు చేసిన పాకంలో వేరు శెనగలను కలిపి ఓ పాత్రలో పెట్టాల్సి ఉంటుంది.
>>ఆ పాత్రలో మిశ్రమం వేసే ముందు తప్పకుండా నెయ్యి కలపాల్సి ఉంటుంది.
>>లింగ్ పిన్‌పై నెయ్యి రాసి చిక్కీని రోల్ చేయండి.
>>ఆ తర్వాత కత్తితో కట్‌ చేసి సర్వ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read : Payal Ghosh : ఎన్టీఆర్ గురించి అప్పుడు చెబితే అంతా నవ్వారు.. పాయల్ ట్వీట్ వైరల్.. చెర్రీ ఫ్యాన్స్ ఫైర్


Also Read : Pooja Hegde Pics : అందుకే త్రివిక్రమ్ పాట రాయించుకున్నట్టున్నాడు.. పూజా హెగ్డే పిక్స్ వైరల



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe