Instant Sambar Recipe: ఇన్‌స్టంట్ సాంబార్ పొడిని 15 నిమిషాల్లో తయారు చేసుకోండి ఇలా..
Instant Sambar Recipe In Telugu: సాంబార్ అంటే ఇష్టమున్నవారు వారంలో ఒక్కరోజైనా తీసుకుంటూ ఉంటారు. అయితే బిజీ లైఫ్ కారణంగా టైమ్ సరిపోను వారు దీనిని ఇన్‌స్టంట్‌గా కూడా తయారు చేసుకోవచ్చు. అయితే ఈ సాంబార్ పొడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Instant Sambar Recipe In Telugu: సాంబార్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు..అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ప్రతి ఒక్క వారంలో ఒకటి నుంచి రెండు సార్లైనా సాంబార్ రైస్ తీసుకుంటారు. దీనిని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ తయారు చేసుకుంటారు. కానీ అందరు మాత్రం కంది పప్పుతోనే తయారు చేసుకుంటారు. కంది పప్పులో శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఫైబర్ గుణాలు కూడా లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీర దృఢంగా ఆరోగ్య వంతంగా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు.
ఈ సాంబార్‌ని కొన్ని రాష్ట్రాల వారు అన్ని రకాల కూరగాలు వేసి తయారు చేసుకుంటే..మరి కొన్ని రాష్ట్రాల ప్రజలు సాదా సీదాగా కేవలం పప్పు, పచ్చి పులుతో మాత్రమే తయారు చేసుకుంటారు. అయితే ఏలా తయారు చేసుకున్న సాంబార్ టేస్టే వేరు. అయితే ప్రస్తుతం చాలా మంది బిజీ లైఫ్ కారణంగా ఇన్‌స్టంట్ పొడులను వినియోగించి ఆహారాలు తయారు చేసుకుంటున్నారు. అంతేకాకుండా వాటినే స్టోర్ కూడా చేసుకుంటున్నారు. అయితే సాంబార్‌లో కూడా ఇన్‌స్టంట్ పొడులు వచ్చాయి. దీనిని వినియోగించి సులభంగా తయారు చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో పప్పుల కంటే ఇవే ఎక్కువగా విక్రయమవుతున్నాయి. అయితే ఈ ఇన్‌స్టంట్ సాంబార్ పొడిని మార్కెట్‌లో కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్‌స్టంట్ సాంబార్ పొడికి కావాల్సిన పదార్థాలు:
✽ 1 కప్పు పెసరపప్పు
✽ 1/2 కప్పు మినపప్పు
✽ 1/4 కప్పు ఉలవలు
✽ 1/4 కప్పు ధనియాలు
✽ 1 టేబుల్‌స్పూన్ మెంతులు
✽ 1 టేబుల్‌స్పూన్ జీలకర్ర
✽ 5 ఎండుమిర్చి
✽ 1/2 టీస్పూన్ పసుపు
✽ 1/4 టీస్పూన్ కారం
✽ 1/4 టీస్పూన్ ఇంగువ
✽ 1/2 టీస్పూన్ ఉప్పు
Also Read Ibomma Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
సింపుల్ పద్దతిలో తయారీ విధానం:
✽ ముందుగా పొయ్యి మీద బాటమ్ పాన్ వేడి చేయాల్సి ఉంటుంది.
✽ అందులోనే కంది పప్పు, మినపప్పు, ఉలవలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చిలను వేసి, సన్నని మంట మీద వేయించాల్సి ఉంటుంది. సువాసన వచ్చే వరకు, గోధుమ రంగు వచ్చే వరకు వేయించండి.
✽ ఆ తర్వాత వాటిని పక్కన పెట్టుకుని కొద్ది సేపు చల్లారనివ్వాల్సి ఉంటుంది.
✽ చల్లబడిన తర్వాత, మిక్సర్ గ్రైండర్‌లో వేసి, పొడిగా సిద్ధం చేయాల్సి ఉంటుంది.
✽ అందులోనే పసుపు, కారం, ఇంగువ, ఉప్పు కలిపి పక్కన పెట్టాల్సి ఉంటుంది.
✽ ఆ తర్వాత గాజు డబ్బాలో నిల్వ ఉంచుకుని కావాల్సినప్పుడు వినియోగించుకుంటే చాలు..
Also Read Ibomma Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter