COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Insulin Sensitivity: మన శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరగడం కారణంగా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా పెరుగుతాయి. దీంతో పాటు ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి కూడా విచ్చలవిడిగా పెరుగుతుంది. దీని కారణంగా ఇన్సులిన్ వినియోగం కూడా దెబ్బతింటుంది. దీంతో చాలా మందిలో రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. దీని కారణంగా ఇన్సులిన్ సెన్సిటివిటీ ఏర్పడుతుంది. అయితే ఇలాంటి సమస్యలు ఉన్నవారిలో శరీరంలో అనేక లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి.  వీటిని గుర్తించి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 


వీటిని తప్పకుండా తీసుకోండి:
ప్రతి రోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో సహజ కొవ్వు కలిగిన ఆహారాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. దీని కోసం తప్పకుండా నానబెట్టిన బాదంను తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు వాల్‌నట్స్‌ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గడమే కాకుండా పొట్ట నిండుగా ఉంటుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.


ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారం తీసుకోవాల్సి ఉంటుంది:
 ఇన్సులిన్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు తప్పకుండా అల్పాహారం తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రోటీన్స్‌ అధిక మోతాదులో లభించే ఆహారాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కాబట్టి ప్రతి రోజు అల్పాహారంలో భాగంగా నానబెట్టిన శనగలు, మిల్లెట్స్‌తో తయారు చేసిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. 


మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు:
శరీరంలోని ఇన్సులిన్ వినియోగం మెరుగుపడడానికి ప్రతి రోజు అల్పాహారంలో తప్పకుండా బాదం, అరటి, ఆకు కూరలు, పప్పులు, తృణధాన్యాలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల కణాలకు గ్లూకోజ్‌ కూడా చేరుతుంది. దీని కారణంగా అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


తిన్న తర్వాత తప్పకుండా నడవండి:
లంచ్ లేదా డిన్నర్ తర్వాత దాదాపు 10-15 నిమిషాలు నడవడం ఎంతో ముఖ్యమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా వాకింగ్‌ చేయడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. 


ఇలా తినండి:
ప్రతి రోజు 12 నుంచి 2 గంటల మధ్య భోజనం చేయడం చాలా మంచిది. ఈ సమయాల్లో తింటేనే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా వేగంగా జీర్ణమవుతుంది. దీని కారణంగా ఇన్సులిన్ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. 


ఇన్సులిన్ సెన్సిటివిటీ లక్షణాలు:
శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ సమస్యలు ఉంటే తీపి తినాలనే కోరికలు కూడా పుడుతూ ఉంటాయి.
దీంతో పాటు అండర్ ఆర్మ్స్, మెడలో ఎక్కువ చీకటి వంటి సమస్యలు రావడం ప్రారంభమవుతాయి. 
అలాగే పొట్ట చుట్టూ కొవ్వు పెరుకుపోతుంది. 
మొటిమలు, ఇతర చర్మ సమస్యలు వస్తాయి. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి