Intermittent Fasting: మన శరీరం ఎప్పుడూ ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలి. దీనికోసం చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. వాకింగ్, యోగా, డైటింగ్, జిమ్ వర్కవుట్స్ ఇలా ఎన్నో..ఎన్నెన్నో. ఈ క్రమంలో కొత్తగా వచ్చింది ఇంటర్‌మిట్టెంట్ ఫాస్టింగ్. దీనివల్ల శరీరంపై కలిగే ప్రభావం ఎలా ఉంటుంది., ప్రయోజనాలు, దుష్పరిణాలేంటనేది తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోజంతా కష్టపడిన తరువాత రాత్రి వేళ హాయిగా, పరిపూర్ణంగా తినాలనుకుంటారు. అంటే రాత్రి డిన్నర్ కంప్లీట్ డిన్నర్‌గా ఉండాలనేది చాలామందికి ఉంటుంది. దీనివల్ల ఆకలి తీరడమే కాకుండా శరీరానికి కావల్సిన ఎనర్జీ లభిస్తుంది. అయితే రోజుల తరబడి రాత్రి వేళ డిన్నర్ మానేస్తే శరీరంలో ఎలాంటి ప్రభావం పడుుతందో తెలుసా..దీనివల్ల ఏమౌతుంది..ఇప్పుడు అదే జరుగుతోంది. కొత్తగా వైద్యులు సూచిస్తున్న ఇంటర్‌మిట్టెంట్ ఫాస్టింగ్. అంటే రోజుకు 12 గంటలు ఏం తినకుండా ఉండటం. రాత్రి వేళ 12 గంటలు తినకుండా ఉండగలగాలి. మిగిలిన 12 గంటల్లో కావల్సింది తినవచ్చు. ఇలా 30 రోజులు చేయడం వల్ల డిన్నర్ స్కిప్ చేయాల్సి వస్తుంది. అప్పుడేం జరుగుతంది.,శరీరంపై పడే దుష్పరిణామాలేంటి..


ఇంటర్‌మిట్టెంట్ ఫాస్టింగ్ ప్రయోజనాలు


క్రమ క్రమంగా బరువు తగ్గుతుంది. డయాబెటిస్ ముప్పు తగ్గి..బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో వస్తాయి. హార్ట్ ఎటాక్ ముప్పు ఉండకపోవచ్చు.రక్త నాళాల్లోంచి చెడు కొలెస్ట్రాల్ నిర్మూలమౌతుంది.అధిక రక్తపోటు సమస్య ఉండదు. శరీరం మెటబోలిజం వేగవంతమౌతుంది.


ఇంటర్‌మిట్టెంట్ ఫాస్టింగ్ సైడ్ ఎఫెక్ట్స్


రోజూ రాత్రి వేళ డిన్నర్ స్కిప్ చేయడం వల్ల మనిషి మస్తిష్కంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. విసుగు, చికాకు ఎదురౌతాయి. డిన్నర్ మానేయడడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ చాలా తగ్గిపోతాయి. రాత్రి డిన్నర్ లేకపోతే శరీరం బలహీనమైపోతుంది. కొంతమందికైతే  తల తిరిగినట్టుగా కూడా ఉంటుంది. శరీరంలో విటమిన్లు, మినరల్స్ సహా వివిద పోషకాల లోపం ఏర్పడవచ్చు. ముందు నుంచి అనారోగ్య సమస్య ఉంటే ఇంటర్‌మిట్టెంట్ ఫాస్టింగ్ మంచిది కాదు.


Also read: Flavonoids: కేన్సర్ ముప్పును తగ్గించే ఫ్లెవనాయిడ్స్ ఏవి, ఎన్నిరకాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook