International Tea Day 2020: మీరు తాగే Tea నాణ్యతను ఎలా డిసైడ్ చేస్తారంటే!
తెల్లవాళ్లు మనకి అంటించి పోయిన అలవాటు టీ (చాయ్). నేడు ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలు చాయ్ అలవాటు చేసుకున్నారు. నేడు డిసెంబర్ 15 న ఇంటర్నేషనల్ టీ డే (International Tea Day 2020) సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కార్మికులకు మరియు రైతులకు టీ వ్యాపారం వల్ల కలిగే ప్రభావాన్ని అంచనా వేయడానికి ఈ రోజు జరుపుకుంటారు. భారత్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, మలేషియా, కెన్యా, వియత్నాం, ఇండోనేషియా, ఉగాండా, టాంజానియా సహాలు పలు దేశాలు ప్రతి ఏడాది ఈరోజున అంతర్జాతీయ చాయ్ దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాయి.
అయితే బెస్ట్ టీ (Tea) తయారుచేయాలంటే ఏం కావాలి, ఏ విషయాలు ఉత్తమ టీని నిర్ణయిస్తాయని చెప్పడానికి కొన్ని విషయాలు దోహదం చేస్తాయి. కింది విషయాలు టీ పౌడర్, ధర, నాణ్యతను నిర్ణయిస్తారు. చాయ్ ప్రియులకు ఆ టిప్స్ వివరాలు మీకోసం..
టీపొడి చేసే ఆకులు (Leaf)
టీ తయారుచేసేందుకు వాడే ఆకులు ఎన్నో విషయాలు చెబుతాయి. చాలా తేలికగా తేలికైన ఆకులు తక్కువ నాణ్యతతో ఉంటాయి. ఏ ఆకులైతే మంచి ఆకారం, రంగును సూచిస్తాయో అవి నాణ్యమైనవి. తక్కువ నాణ్యత గల ఆకులు అంత రుచిని ఇవ్వవు. సాధారణంగా ప్యాకింగ్ చేసిన టీ కన్నా బయట ఉండే ఆకులు, పౌడర్‌తో చేసే టీ మంచి నాణ్యతను సూచిస్తుంది.
Also Read: 5 Reasons for Heart Attack: గుండెపోటుకు ప్రధాన కారణాలు ఇవే.. బీ కేర్‌ఫుల్!
వాసన (Smell)
సరైన వాసన గుర్తించడానికి పొడి ఆకుల కన్నా తడి ఆకులు తీసుకోవడం ఉత్తమం. టీ పొడి తయారుచేసే ఆకులు తడిగా ఉన్నప్పుడు వాటి వాసన చూస్తే దాని పరిమళాన్ని అంచనా వేయవచ్చు. మంచి నాణ్యత ఉన్న ఆకులైతే సువాసన వెదజల్లుతాయి. కొన్ని గంటల తర్వాత సైతం అదే వాసన కలిగి ఉంటే అధిక నాణ్యత ఉందని చెప్పవచ్చు.
Also Read: Health Tips: నారింజ పండు తొక్కే కదా అని పారేయవద్దు.. ఈ లాభాలు తెలుసా!
రుచి
మీ నోటిలోని రుచిమొగ్గలు నాలుక రుచిని గుర్తిస్తాయి. టీ తాగే సమయంలో నాలుక మీద ఉన్న రుచిమొగ్గలు టీ రుచిని పసిగడతాయి. తాగుతున్న సమయంలో కాస్త తీక్షణంగా రుచి ఎలా ఉందని గ్రహిస్తే టీ నాణ్యపై మీకు ఓ అవగాహన వస్తుంది. కొన్ని రకాల టీ పొడి మంచి రంగు, వాసన కలిగి ఉంటుంది. కానీ రుచి మాత్రం అంతగా ఉండదు.
Also Read: Health Tips: రోగనిరోధక శక్తిని పెంచే 5 చిట్కాలు
తాజాదనం
కొన్నిసార్లు టీ తాగితే నీళ్లు తాగినట్లే అనిపిస్తుందని, లేకపోతే వేడినీళ్లు తాగినట్లు ఉందని తరచుగా వింటూనే ఉంటాం. మౌత్‌ఫీల్ అంటే టీ తాగిన అనుభూతి రావాలి. టీ తాగుతున్నప్పుడు నీటి కంటే కాస్త మందంగా, రుచికరమైన ద్రవాన్ని ఆస్వాదిస్తున్న అనుభూతి కలగాలి. అధిక నాణ్యత గల చాయ్ తాగితే ఎక్కువ సమయం మౌత్ ఫీల్ ఇస్తుంది.
Also Read: Health Benefits Of Bitter Gourd: ఈ ప్రయోజనాలు తెలిస్తే కాకరకాయ కచ్చితంగా తింటారు
ఫీల్ ద టీ
చాయ్ తాగిన తర్వాత కొందరు నాకు టీ తాగినట్లే అనిపించలేదు అంటారు. అలా కాకుండా టీ తాగిన కొన్ని నిమిషాల వరకు దాని ప్రభావం మనపై ఉంటే మీరు నాణ్యమైన టీ తాగినట్టే. కొన్నిసార్లు ఒకటి రెండు సిప్స్ వరకు బాగున్నట్లు అనిపించినా.. ఆ తర్వాత మొత్తం టీ తాగడం పూర్తయ్యాక నోరు అదోలా ఉంటే మాత్రం అది నాణ్యమైన టీ కాదని చెప్పవచ్చు.
Also Read : Health Benefits Of Curry Leaves: కరివేపాకుతో షుగర్ కంట్రోల్, గర్భిణులకు మేలు సహా ఎన్నో ప్రయోజనాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe