Indian Railways: ఛార్ట్ సిద్ధమైన తరువాత కూడా టికెట్ రద్దు చేసుకుంటే రిఫండ్, ఎలాగంటే, ఐఆర్‌సీటీసీ తాజా అప్‌డేట్
Indian Railways: ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ కారణంగా మీరు మీ ట్రైన్ టికెట్ కేన్సిల్ చేయాలనుకుంటే..అప్పటికే ట్రైన్ ఛార్ట్ తయారైపోయినా సరే రిఫండ్ కోసం అప్లై చేయవచ్చు. రైల్వేశాఖ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ ప్రోసెస్ ఎలా చేయాలో తెలుసుకుందాం..
Indian Railways: ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ కారణంగా మీరు మీ ట్రైన్ టికెట్ కేన్సిల్ చేయాలనుకుంటే..అప్పటికే ట్రైన్ ఛార్ట్ తయారైపోయినా సరే రిఫండ్ కోసం అప్లై చేయవచ్చు. రైల్వేశాఖ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ ప్రోసెస్ ఎలా చేయాలో తెలుసుకుందాం..
రైల్వే యాత్రికులకు ఇది చాలా ముఖ్యమైన సమాచారం. ప్రతిరోజూ రైల్వే ద్వారా కోట్లాదిమంది ప్రయాణీకులు ప్రయాణిస్తుంటారు. అందుకే రైల్వేకు సంబంధించిన అప్‌డేట్స్ తెలుసుకోవడం చాలా మంచిది. ఏదో ఒక ఎమర్జెన్సీ కారణంగా చాలాసార్లు ట్రైన్ ఛార్ట్ సిద్ధమైన తరువాత కూడా రైలు టికెట్ కేన్సిల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితుల్లో కూడా మీరు రద్దు చేసిన టికెట్ రిఫండ్ మీకు లభిస్తుంది. ఇండియన్ రైల్వే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. రిఫండ్ ఏ విధంగా ఎలా పొందాలనేది వివరించింది.
ఐఆర్‌సీటీసీ తాజా అప్‌డేట్
ఐఆర్‌సీటీసీ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఓ వీడియ షేర్ చేస్తూ రద్దు చేసిన టికెట్ రిఫండ్ ఎలా పొందాలో వివరించింది. రైల్వే నియమాల ప్రకారం మీరు టికెట్ డిపాజిట్ రసీదు సమర్పంచాల్సి ఉంటుంది. ట్రైన్ టికెట్ ఇలా కొన్ని సులభమైన స్టెప్స్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ టీడీఆర్ ఇలా సమర్పించాలి
దీనికోసం ముందుగా మీరు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ www.irctc.co.in ఓపెన్ చేయాలి. ఆ తరువాత హోమ్‌పేజిపై My Account క్లిక్ చేయాలి. ఇప్పుడు మెనూలో వెళ్లి My transaction ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత File TDR ఆప్షన్‌లో ఏదో ఒక ఆప్షన్ ఎంచుకుని టీడీఆర్ ఫైల్ చేయాలి. ఇప్పుడు మీకు ఎవరి పేరుపై టికెట్ ఉందో ఆ వ్యక్తి సమాచారం కన్పిస్తుంది. ఇప్పుడు మీరు పీఎన్ఆర్ నెంబర్, ట్రైన్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసి..రద్దు చేయాల్సిన నియమాల బాక్స్‌పై టిక్ చేయాలి. ఆ తరువాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత మీకు బుకింగ్ సమయంలో ఫార్మ్‌లో ఇచ్చిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీను ఎంటర్ చేసిన తరువాత సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి. పీఎన్ఆర్ వివరాల్ని సమర్పించి..టికెట్ కేన్సిలేషన్ క్లిక్ చేయాలి. అప్పుడు మీకు రద్దైన టికెట్ రిఫండ్ నగదు కన్పిస్తుంది. బుకింగ్ ఫార్మ్‌పై ఇచ్చిన నెంబర్‌కు నిర్ధారణ కోసం ఓ మెస్సేజ్ వస్తుంది. ఇందులో పీఎన్ఆర్ , రిఫండ్ గురించిన పూర్తి సమాచారం లభిస్తుంది.
Also read: Astrology: ఈ నాలుగు రాశుల వారు పిసినారులట.. కానీ పెట్టుబడుల్లో మాత్రం ఫస్ట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook