Astrology: ఈ నాలుగు రాశుల వారు పిసినారులట.. కానీ పెట్టుబడుల్లో మాత్రం ఫస్ట్..

These Zodiac sign people are Miser: జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ నాలుగు రాశుల వారు పిసినారులు.. కానీ పెట్టుబడుల విషయంలో మాత్రం వీరు ముందుంటారు.. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకోండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2022, 02:23 PM IST
  • రాశిచక్రం ప్రకారం ఈ నాలుగు రాశుల వారు పిసినారులట
  • పెట్టుబడుల్లో మాత్రం వీరు ముందుంటారట
  • ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకోండి
 Astrology: ఈ నాలుగు రాశుల వారు పిసినారులట.. కానీ పెట్టుబడుల్లో మాత్రం ఫస్ట్..

These Zodiac sign people are Miser: డబ్బు సంపాదించడమే కాదు దాన్ని పొదుపు చేయడం కూడా తెలిసి ఉండాలి. అప్పుడే భవిష్యత్ అవసరాలకు ఇంకొకరి వద్ద చేయి చాచే పరిస్థితి తలెత్తదు. కొంతమంది వ్యక్తులు బాగా డబ్బు సంపాదిస్తారు.. కానీ విచ్చలవిడి ఖర్చులతో అవసరానికి చేతిలో డబ్బు లేకుండా చేసుకుంటారు. మరికొందరు అవసరానికి మాత్రమే డబ్బు ఖర్చు చేస్తారు. అవసరం లేనిదే ఒక్క పైసా జేబు నుంచి బయటకు తీయరు. అలాంటి వారిని సమాజం పిసినారి అని ముద్ర వేసినా సరే.. అదే ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తారు. రాశిచక్రం ప్రకారం ఈ 4 నాలుగు రాశుల వారు డబ్బు ఖర్చు చేయడంలో పిసినారులని చెబుతారు. కానీ పెట్టుబడుల విషయంలో వీరు ముందుంటారు.

మేష రాశి : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశి వారు చాలా తెలివిగా ఆలోచిస్తారు. వీలైనంత ఎక్కువ డబ్బును కూడబెడుతారు. పెట్టుబడుల ద్వారా ఆదాయాన్ని పొందే మార్గాలను అన్వేషిస్తారు. పెట్టబడులు ఆర్థిక వృద్దికి దోహదపడుతాయని నమ్ముతారు. వీరు సాధారణ జీవితాన్నే గడుపుతారు.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారు డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో అత్యంత జాగ్రత్తగా ఉంటారు. పైసా ఖర్చు పెట్టేముందు వెయ్యి సార్లు ఆలోచిస్తారు.
వృథా ఖర్చుల జోలికి వెళ్లరు. ముఖ్యమైన పనులకు మాత్రమే తమ జేబుల్లో నుంచి డబ్బు తీస్తారు.

కన్య రాశి: కన్య రాశి వారు డబ్బు ఆదా చేయడంలో ముందుంటారు. డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరమొచ్చినా సరే.. తెలివిగా ఆ పరిస్థితిని దాటవేస్తారు. ఆర్థిక క్రమశిక్షణతో మెలుగుతారు. అవసరం లేని పనులకు డబ్బును వెచ్చించరు. పెట్టుబడులు పెట్టడంలో ముందుంటారు.

మకర రాశి: మకర రాశి వారు చాలా కష్టజీవులు. కష్టపడి పైసా పైసా కూడబెట్టి డబ్బు సంపాదిస్తారు. సరైన సందర్భంలో దాన్ని పెట్టుబడిగా పెడుతారు. పెట్టుబడుల విషయంలో వీరికి మంచి పట్టు ఉంటుంది. పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయంతో బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటారు. 

Also Read: Hyderabad Blast: హైదరాబాద్‌లో బాంబు బ్లాస్ట్.. ఒకరు మృతి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News