Pomegranate Benefits: దానిమ్మ గింజలను రాత్రి తినడం మంచిదేనా? తింటే ఏం జరుగుతుందో మీరే తెలుసుకోండి..
Eating Pomegranate At Night Benefits: దానిమ్మ రసాన్ని ఉదయం కంటే రాత్రిపూట తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్ పరిమాణాలు శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను సైతం కరిగిస్తాయి. కాబట్టి మీరు కూడా రాత్రిపూట ఒకసారి ట్రై చేయండి.
Eating Pomegranate At Night Benefits: దానిమ్మ గింజలను పిల్లలనుంచి పెద్దవారి దాకా ఎంతో ఇష్టపడుతూ తింటూ ఉంటారు ఇవి ఏ కాలాల్లోనైనా సులభంగా లభిస్తాయి. అంతేకాకుండా వీటి చెట్లను ఇళ్లల్లో కూడా పెంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ దానిమ్మ పండ్లు ఔషధంలా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వీటి గింజలను రసంలా తయారు చేసుకుని తాగడం వల్ల శరీరానికి చాలా రకాల పోషకాలు అందుతాయి. అంతేకాకుండా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు అయితే చాలామంది దానిమ్మ గింజలను రాత్రిపూట తింటూ ఉంటారు ఇలా చేయడం మంచిదేనా? ఇలా చేయడం వల్ల శరీరానికి ప్రయోజనాలు కలుగుతాయా? దీనికి సంబంధించిన మరింత సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం..
దానిమ్మ గింజలను రాత్రిపూట తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి ఇందులో ఫైబర్, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియంతో పాటు జింక్, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు వీటిని రాత్రి పూట తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా తరచుగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్న వారు ఈ గింజలను ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ గింజలలో ఉండే ఫైబర్ పొట్టలోని గ్యాస్, మలబద్ధకం సమస్యలకు ప్రభావవంతంగా పనిచేస్తుంది.
Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా
దానిమ్మ గింజలతో తయారుచేసిన జ్యూస్ ని రాత్రి సమయంలో తాగడం వల్ల రక్తహీనతతో పాటు రక్తసరఫరాలో ఏవైనా లోపాలు ఉంటే సులభంగా ఉపశమనం కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా ఎముకల సమస్యలతో బాధపడేవారు ఒక గ్లాస్ దానిమ్మ రసంలో ఒక టీ స్పూన్ అల్లం రసం వేసి మిక్స్ చేసి అల్పాహారం తీసుకునే అరగంట ముందు తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పుల నుంచి కూడా ఈ రసం ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ రసంలో ఉండే అద్భుత గుణాలు ఎముకలను దృఢంగా మార్చేందుకు ఎంతో సహాయపడతాయి ముఖ్యంగా నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు ఈ రసాన్ని పడుకునే ముందు తాగితే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా దానిమ్మ గింజల్లో అధిక మొత్తంలో ఫైబర్ పరిమాణాలు లభిస్తాయి. కాబట్టి వీటిని ఉదయం పూట తీసుకునే అల్పాహారంలో భాగంగా తీసుకుంటే సులభంగా చెడు కొలెస్ట్రాల్ సమస్యకు చెక్ పెట్టొచ్చు. సంతానలేని సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ప్రభావంతంగా ఈ రసం సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి