Junk Food Side Effects: ఈ రోజు ఆరోగ్యకరమైన పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకుంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. ఆధునిక జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలామంది జింక్ ఫుడ్స్ విచ్చలవిడిగా తింటున్నారు. ఇలా తినడం చాలా ప్రమాదకరమని నేషనల్ ఫుడ్ అండ్ టెస్టింగ్ ఏజెన్సీ పేర్కొంది. 2019లో జంక్ ఫుడ్ తినే వారి సంఖ్య 25 శాతం ఉంటే ప్రస్తుతం 40 శాతంకి పెరిగిందని ICMR తెలిపింది. ప్రతిరోజు అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు రావడమే కాకుండా వయస్సు పై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు జంక్ ఫుడ్ తినడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు శరీరానికి కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జంక్ ఫుడ్ ఎందుకు హానికరం:
జంక్ ఫుడ్ లో చెడు కొలెస్ట్రాల్, ఉప్పు పరిమాణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోయి తీవ్ర వ్యాధుల బారిన పడతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి స్ట్రీట్ ఫుడ్ కు దూరంగా ఉండడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. భారతదేశంలో ప్యాక్ చేసిన ఆహార పదార్థాలలో కొవ్వు, నూనె, ఉప్పు పరిమాణం FSSAI ప్రమాణాల కంటే ఎక్కువగా ఉన్నాయని..చిప్స్, స్నాక్స్, బర్గర్‌లు, స్ప్రింగ్ రోల్స్, పిజ్జా వంటి 33 జంక్ ఫుడ్‌లు ఇందులో భాగమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి ఆహారాలను ఎప్పుడూ తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. 


Also read: Buttermilk Cautions: మజ్జిగ ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదని తెలుసా, ఎప్పుడు తాగితే మంచిది


ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల కూడా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు. ఆహార పదార్థాలను నూనెలో అతిగా వేయించడం కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని రెగ్యులర్ గా జంక్ ఫుడ్ తినే వారిలో దంతాల సమస్యతో పాటు రక్తపోటు, మలబద్ధకం, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి ఆహారాలు తీసుకోవడం కారణంగా ప్రతి సంవత్సరం 8 శాతం మంది తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు.
 
గుండె సమస్యలు:

జంక్ ఫుడ్ లో కార్బోహైడ్రేట్ల పరిమాణాలు గా ఉంటాయి అంతేకాకుండా ఇందులో పీచు పదార్థాలు తక్కువగా ఉండటం వల్ల జీర్ణ క్రియ సమస్యల బారిన పడతారు. దీని కారణంగా కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరిగి రక్తంలో మార్పులు వచ్చి తీవ్ర గుండెపోటు సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి జంక్ ఫుడ్ తినడం మానుకోవాలి. అంతే కాకుండా జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది.


Also read: Buttermilk Cautions: మజ్జిగ ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదని తెలుసా, ఎప్పుడు తాగితే మంచిది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook