Kakarakaya Podi Recipe In Telugu: మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడే ఛాన్స్‌ ఉంది. దీంతో పాటు డయాబెటీస్‌ ఉన్నవారు ప్రతి రోజు తీసుకునే ఆహారాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా మంది ఆహారాలు తీసుకునే క్రమంలో వివిధ రకాల పోడులను వినియోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు ప్రతి రోజు అల్పాహారంలో కాకరకాయ పొడిని మిక్స్‌ చేసి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు రక్తంలోని చక్కెర పరిమాణాలను కూడా నియంత్రిస్తారు. దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా ఉంటారు. అయితే మీరు కూడా కాకర పొడిని తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా చేసుకోండి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కావాల్సిన పదార్థాలు:
1 కాకరకాయ 
1 టేబుల్ స్పూన్ - మినప్పప్పు 
ఉప్పు - రుచికి సరిపడా
ఎండు మిరపకాయలు - 4 నుంచి 5
జీలకర్ర - 1 టీస్పూన్
కొత్తిమీర - 1 టేబుల్ స్పూన్ (తరిగినది)


తయారీ విధానం:
ముందుగా ఒక పెద్ద బౌల్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో కాకరకాయను వేసి నీటిని వేసుకుని బాగా కడగాల్సి ఉంటుంది. 
ఆ తర్వాత ఈ కాకరలను చిన్న ముక్కలుగా కోయాలి.
ఒక పాన్‌లో మినప్పప్పును వేయించి, బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
ఆ తర్వాత అదే పాన్‌లో ఎండు మిరపకాయలు, జీలకర్ర వేసి వేయించాలి.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!
అన్ని బాగా వేగిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసి, ఉప్పు వేసి బాగా కలపాలి.
ఆ తర్వాత కాకరకాయ బాగా వేగేంత వరకు నూనెలో అలాగే వేయించి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
అందులో చివర కొత్తిమీర తరిగి వేసి కలపాలి.
కాకరకాయలను మిక్సీలో వేసి పొడిలా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోండి.


చిట్కాలు:
కాకరకాయలోని చేదును తగ్గించడానికి, ముక్కలుగా కోసిన తర్వాత కొద్దిసేపు ఉప్పు నీటిలో నానబెట్టవచ్చు.
మీరు మరింత రుచి కోసం పొడిలో కొద్దిగా పసుపు, మెంతులు కూడా వేయవచ్చు.
కాకరకాయ పొడిని అన్నం, పప్పు, రోటీ లేదా ఇతర వంటకాలతో తినవచ్చు.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి