Kalonji Benefits: కలోంజి గింజలు మీ డైట్ లో చేర్చుకుంటే ఈ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం..
Kalonji Health Benefits: కలోంజి గింజలను నల్ల జీలకర్ర అని కూడా పిలుస్తారు. ఇందులో ఎక్కువ శాతం ప్రోటీన్ ఉంటుంది ముఖ్యంగా ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి.
Kalonji Health Benefits: కలోంజి గింజలను నల్ల జీలకర్ర అని కూడా పిలుస్తారు. ఇందులో ఎక్కువ శాతం ప్రోటీన్ ఉంటుంది ముఖ్యంగా ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి. కలోంజి గింజలు డైట్లో చేర్చుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అవి ఏంటో తెలుసుకుందాం.
యాంటీ ఆక్సిడెంట్ గుణాలు..
కలోంజి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. థైమోక్వినోన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుతుంది దీంతో ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
మంటను తగ్గిస్తుంది..
కొన్ని నివేదికల ప్రకారం కలోంజి గింజలు యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. దీంతో ఆర్థరైటిస్ మంట, వాపు సమస్య ఉండదు.
జీర్ణ ఆరోగ్యం..
కలోంజి గింజలు పేగు ఆరోగ్యానికి తోడ్పడతాయి. డైజెస్టివ్ ఎంజైమ్స్ ను వేరు చేస్తుంది దీంతో జీర్ణక్రియకు, జీవన ఆరోగ్యానికి ప్రేరేపిస్తుంది.
బరువు నిర్వహణ..
ప్రతిరోజు కలోంజి గింజలు మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి మన డైట్లో చేర్చుకోవడం వల్ల కడుపు నిండిన అనుభూతి ఎక్కువసేపు కలుగుతుంది. దీంతో అతిగా తినకుండా ఉంటారు అతిగా బరువు కూడా పెరగరు.
ఇమ్యూనిటీ బూస్ట్..
కలోంజి గింజల్లో విటమిన్ ఏ, విటమిన్ సి మన శరీరానికి కావాల్సిన ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి సీజనల్ ఇన్ఫెక్షన్ల బారిన మన శరీరం పడకుండా నివారిస్తుంది.
చర్మం, జుట్టు ఆరోగ్యం..
కలోంజి గింజలు ఉండే లైనోలిక్ యాసిడ్ ఆరోగ్యకరమైన చర్మానికి జుట్టుకు ప్రోత్సహిస్తుంది. ఇది లోతైన పోషణను అందిస్తుంది. దీంతో హెయిర్ ఫాలికల్ డామేజ్ అవ్వకుండా ఆరోగ్యంగా ఉంటాయి. కలోంజి గింజలను ఉపయోగించి కొబ్బరి నూనెలో వేసి నూనె కూడా తయారు చేసుకుంటారు. దీంతో జుట్టు కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది. అంతేకాదు కలోంజి గింజలు ప్రతిరోజు డైట్ లో చేర్చుకోవడం వల్ల డిటాక్సిఫై చేస్తుంది. దీంతో స్కిన్ సెబమ్ ఉత్పత్తి తగ్గిపోతుంది. చర్మం ఆరోగ్యంగా మెరుస్తుంది.
ఇదీ చదవండి: ఇత్తడి వస్తువులను ఇంట్లోని ఈ ఒక్క వస్తువుతో క్లీన్ చేస్తే తళతళా మెరిసిపోతాయి..
గుండె ఆరోగ్యం..
కొన్ని నివేదికల ప్రకారం కలోంజి గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుండె ఆరోగ్యానికి తోడ్పడుతాయి. ఎందుకంటే ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించేసి, గుండె ఆరోగ్యానికి బూస్టింగ్ ఇస్తాయి. దీంతో మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి.
షుగర్ నియంత్రణ..
కలోంజి గింజల్లో హైపోగ్లైజెమిక్ ఎఫెక్ట్ ఉంటుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరగవు. ఇన్సులిన్ సెన్సిటివ్ మెరుగుపడుతుంది. కొన్ని నివేదికల ప్రకారం కలోంజి గింజలు గ్లూకోస్ ని గ్రహించడం తగ్గిస్తుంది. అంతే కాదు ఇందులో ఉండే పొటాషియం బ్లడ్ షుగర్ లెవెల్ నిర్వహిస్తుంది.
ఇదీ చదవండి: ఆరెంజ్ జ్యూస్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ శరీరంలో ఏ మార్పులు జరుగుతాయో తెలుసా?
జలుబుకు చెక్..
కలోంజి గింజల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు జలుబు దగ్గు సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని కాపాడతాయి అందుకే కచ్చితంగా కలోంజి గింజలను చేర్చుకోవాల్సిందే.
క్యాన్సర్..
కలోంజి గింజల్లో థైమోక్వినైన్ క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడుతుంది. అంటే ముఖ్యంగా క్యాన్సర్ కణాలు పెరగకుండా నివారిస్తుందని కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి