Karivepaku Karam Podi: వేడివేడి అన్నంలో కరివేపాకు పొడి వేసుకొని తింటే ఉంటుంది నా సామిరంగా! ఈ రెసిపీ మీ కోసమే..
Karivepaku Karam Podi Recipe Indian Style: కరివేపాకు కారం పొడిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అయితే ఈ కారంపొడి రెసిపీని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Karivepaku Karam Podi Recipe Indian Style: భారతీయులు ప్రతి ఒక్క వంటకంలో కరివేపాకును వినియోగిస్తారు. ఎందుకంటే ఇది వాటి రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. కరివేపాకులో ఉండే గుణాలు జుట్టుతో పాటు కంటి సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగించేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా శరీరాన్ని రక్షిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఆహార పదార్థాల్లో కరివేపాకు వినియోగిస్తారు. అయితే కొంతమంది దీనితో వివిధ రకాల రెసిపీలను తయారు చేసుకుంటారు. ముఖ్యంగా చాలామంది కరివేపాకుతో కారంపొడులను కూడా తయారు చేసుకుంటారు. ప్రతిరోజు అల్పాహారంలో తీసుకునే ఇడ్లీలో వేడివేడి అన్నంలో ఈ పొడిని ఎక్కువగా వినియోగిస్తారు. ఈ కారంపొడిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల లాభాలు కలుగుతాయి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయాలనుకుంటున్నారా? ఇలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
కరివేపాకు కారం పొడి రెసిపీకి కావలసినవి:
✾ కరివేపాకు - 2 కప్పులు
✾ ఎండు మిరపకాయలు - 10-12
✾ శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
✾ మినప్పప్పు - 1 టేబుల్ స్పూన్
✾ జీలకర్ర - 1 టీస్పూన్
✾ ధనియాలు - 1 టీస్పూన్
✾ వెల్లుల్లి రెబ్బలు - 4-5
✾ ఉప్పు - రుచికి సరిపడా
✾ నూనె - 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం:
✾ కరివేపాకును శుభ్రంగా కడిగి, నీడలో బాగా ఆరబెట్టాలి.
✾ ఒక పాన్‌లో నూనె వేసి వేడి చేయాలి.
✾ నూనె వేడి అయిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు వేసి, బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి.
✾ తర్వాత జీలకర్ర, ధనియాలు, ఎండు మిరపకాయలు వేసి, ఒక నిమిషం పాటు వేయించాలి.
✾ చివరగా వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి, 2-3 నిమిషాలు వేయించాలి.
✾ అన్నీ బాగా వేగిన తర్వాత, ఒక ప్లేట్ లోకి తీసి చల్లారనివ్వాలి.
✾ చల్లారిన తర్వాత, మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి.
✾ ఈ పొడిని ఒక గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్..1 గంట ఛార్జ్ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..
చిట్కాలు:
✾ కరివేపాకును ఎక్కువసేపు వేయించకూడదు. ఎక్కుగా వేయించడం వల్ల అందులో పోషకాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి.
✾ ఈ కారం పొడిని తప్పకుండా గాజు డబ్బలో నిల్వ చేసుకుంటే నెల వరకు ఉంటుంది.
ఆరోగ్య ప్రయోజనాలు:
✾ కరివేపాకు కారం పొడి జీర్ణక్రియకు మంచిది.
✾ ఇందులో ఉండే గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
✾ జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.
ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్..1 గంట ఛార్జ్ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter