Kiss Day 2023: ముద్దులు పెట్టుకుంటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా? తెలిస్తే ట్రై చేయకుండా ఉండలేరు!
Kiss Day 2023: ఫిబ్రవరి ఏడో తారీఖున మొదలైన వాలెంటైన్స్ వీక్ ఫిబ్రవరి 14వ తేదీ అంటే రేపటితో ముగియనుండగా ఈరోజు కిస్ డే సందర్భంగా ఒక స్పెషల్ స్టోరీ మీ కోసం
Kiss Day Special 2023: ప్రేమికులంతా ప్రేమ మత్తులో మునిగి పోయారు, ఈ వారం అంతా వాలెంటైన్స్ వీక్ సంబరాలు జరుపుకుంటున్నారు. ఫిబ్రవరి ఏడో తారీఖున మొదలైన ఈ వాలెంటైన్స్ వీక్ ఫిబ్రవరి 14వ తేదీ అంటే రేపటితో ముగియనుంది. ఇక వాలెంటైన్స్ డే వీక్ లో ఈరోజు కిస్ డే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కిస్ డే గురించి కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సాధారణంగా కిస్ అంటేనే చాలామంది రొమాన్స్ కి మొదటి మెట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ప్రేమను వ్యక్తం చేయడానికి ఈ కిస్ అనేది ఒక అద్భుతమైన సాధనం అని మానసిక నిపుణులు చెబుతున్నారు.
ఈ కిస్లో కూడా అనేక రకాల కిస్సులు ఉన్నాయి. ఫ్లయింగ్ కిస్ మొదలు లిప్ కిస్, ఫ్రెంచ్ కిస్, పెక్ కిస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా అనేక రకాలు ఉన్నాయి. అయితే ఈ ముద్దు పెట్టుకోవడం వల్ల వచ్చే నష్టాలు సంగతి పక్కన పెడితే లాభాల గురించి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ముద్దు పెట్టు కోవడం అనేది కొన్ని హార్మోన్స్ తో కూడి ఉంటుంది. హ్యాపీ హార్మోన్స్ ఈ ముద్దు పెట్టుకున్నప్పుడే రిలీజ్ అవుతాయి. అలా ముద్దు పెట్టుకున్న సమయంలో బ్రెయిన్ కి మంచి ఫీలింగ్ అందుతుంది. అలా అందడం వల్ల ఆక్సిటోసిన్, సెరోటోనిన్లు మెదడుకు అందుతాయట. అవి మీకు ఆనందాన్ని పెంచి మీ మీద ఉన్న ఒత్తిడిని తగ్గిస్తాయట.
అంతేకాదు ఇలా ముద్దు పెట్టుకోవడం వల్ల ఎదుటి వ్యక్తితో ఉన్న రిలేషన్ మరింత పెరుగుతుంది. ఆ రిలేషన్ పెరగడం అనేది మీ బంధంలో చాలా ముఖ్యమైన విషయం. ఇది మీరు మరింత దగ్గర అయ్యేందుకు ఉపయోగపడుతుందట. మీ పార్ట్నర్ ని పదేపదే ముద్దు పెట్టుకోవడం వల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరుగుతుందని మనిద్దరం ఒక్కటే అనే భావన పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే మీరు ఏదైనా సమస్య గురించి ఎక్కువగా టెన్షన్ పడుతున్నా, దాని గురించి ఏం చేయాలనే ఆలోచన మీ మెదడుకు తట్టకపోయినా మీకు అత్యంత ఇష్టమైన వారిని ముద్దు పెట్టుకుంటే దానికి ఏదో ఒక ముందు దొరికినట్లు అవుతుందట.
ఆ ముద్దు పెట్టుకోవడం వల్ల శారీరిక ప్రక్రియలు ప్రభావితం అవుతాయని అప్పుడు రిలీజ్ అయ్యే ఆక్సిటోసిన్ మీ ఆందోళనలను దూరం చేస్తుందని చెబుతున్నారు. ఇక ముద్దు అనేది రక్తనాళాలను విస్తరించి రక్తపోటు తగ్గేలా చేస్తుందని కూడా వైద్య నిపుణులు చెబుతున్నారు. అలా ముద్దు పెట్టుకున్నప్పుడు హృదయ స్పందన రేటు కూడా పెరుగుతుందని చెబుతున్నారు. ఇక మహిళలకు పీరియడ్స్ వచ్చే టైంలో కనుక ముద్దు పెట్టుకుంటే ఆ సమయంలో వారికి కలిగే నొప్పి, తిమ్మిరి వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందట.
ముద్దు పెట్టుకున్న సమయంలో మంచి అనుభూతి కలిగించే రసాయనాలు రిలీజ్ అవుతాయి కాబట్టి ఆ టైంలో ముద్దు పెట్టుకోవడం మంచిదని చెబుతున్నారు. అలాగే ముద్దు పెట్టుకునే సమయంలో ఒకరి నోటి నుంచి మరొకరికి సూక్ష్మ క్రిములు ప్రయాణిస్తాయట, అలా ప్రయాణించడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే అది ఎదుటివారు కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే సుమీ, వారికి ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ మూతి ముద్దులకు దూరంగా ఉండటమే బెటర్ అని అంటున్నారు.
Also Read: Rose petals: అందానికే కాదు, ఒత్తిడి సైతం చిటికెలో దూరం చేసే రోజ్ పెటల్స్ స్నానం, ఎలాగంటే..
Also Read: Camphor Benefits: రూ.2 కర్పూరంతో ఇన్ని జబ్బులు నయమవుతాయా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook