అందరూ క్రిస్మస్ తాతయ్య గురించి వినుంటారు.. కానీ క్రిస్మస్ నానమ్మ గురించి ఎవరైనా విన్నారా.. బహుశా వినుండరు.. కానీ.. మీకో విషయం తెలుసా.. కొన్ని పాత కథల్లో క్రిస్మస్ నానమ్మ అనే ఒక పాత్ర కూడా ఉంది. క్రిస్మస్ నానమ్మనే లేడీ శాంతాక్లాజ్ అని కూడా అంటారు. మరి ఈమె కథా కమామీషు ఏంటో మనం కూడా తెలుసుకుందామా..!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. క్రిస్మస్ నానమ్మ అసలు పేరు లేడీ శాంతాక్లాజ్. క్రిస్మస్ తాతయ్య యాత్రకి బయలుదేరేటప్పుడు.. పిల్లలకు పంచడానికి స్వీట్లు, కుకీస్ తయారుచేసి ఇచ్చేది ఎవరనుకున్నారు.. ఈ క్రిస్మస్ నానమ్మే. 


2.1849లో తొలిసారిగా ఈ క్రిస్మస్ నానమ్మ పాత్రను "ఏ క్రిస్మస్ లెజెండ్" అనే కథలో రాశారు రచయిత జేమ్స్ రీస్. 


3.ఈ కథలో తమ కూతురిని కోల్పోయిన ముసలి దంపతులు యాత్రికుల అవతారం ఎత్తి క్రిస్మస్ సందర్భంగా సుదూర ప్రాంతాలకు వెళ్తూ..పేదపిల్లలకు స్వీట్లు, పుస్తకాలు పంచడానికి పూనుకుంటారట.


4.ఈ కథ బాగా ప్రాచుర్యం అయ్యాక క్రిస్మస్ నానమ్మ పాత్రను ఎక్కువగా కార్టూన్స్‌లో కూడా చిత్రీకరించారు పలువురు ఆర్టిస్టులు, రైటర్లు.


5.కొన్ని రోజుల తర్వాత లేడీ శాంతాక్లాజ్ పాత్ర చుట్టూ తిరిగే కథలతో పలు సినిమాలు కూడా తీశారు దర్శకులు. శాంతాక్లాజ్ కాంకర్స్ ది మార్షియన్స్ (1964), ది నైట్ దే సేవ్డ్ క్రిస్మస్ (1984), ఫ్రెడ్ క్లాజ్ (2007) చిత్రాలను అందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు