Best Coffee Recipes: కోల్డ్ కాఫీ తాగడాన్ని చాలా మంది ఆస్వాదిస్తుంటారు. ఒకరికి ట్రీట్ ఇవ్వాలన్నా లేదా ప్రశాంతంగా కాఫీ ఎంజాయ్ చేస్తూ తాగాలన్నా కోల్డ్ కాఫీ మంచి ప్రత్యామ్నాయంగా కన్పిస్తోంది. అయితే ఇందులో కూడా విభిన్న రుచులున్నాయి. 7 బెస్ట్ కోల్డ్ కాఫీ రెసిపీల గురించి ఇక్కడ తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Classic Iced Coffee ఎప్పుడు ఏ సమయంలోనైనా మంచి అనుభూతిని కల్గించే కాఫీ ఇది. స్ట్రాంగ్ కాఫీలో పాలు కలుపుకుని..గుప్పెడు ఐస్ క్యూబ్స్ కలుపుకుని తగినంత షుగర్ యాడ్ చేస్తే అదే క్లాసిక్ ఐస్డ్ కాఫీ. అత్యంత సులభంగా తయారు చేసుకోవచ్చు.


Vanilla cold brew కాఫీకు కాస్త లేటెస్ట్ రుచి తగిలించాలనుకుంటే వెనీలా కోల్డ్ బ్రూ మంచి ఆప్షన్. స్ప్లాష్ మిల్క్‌తో  చిల్డ్ కోల్డ్ కాఫీ మిశ్రమాన్ని కలుపుకోవాలి. కొద్దిగా వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌తో పాటు రుచి కోసం స్వీట్ర్నర్ వేసి ఐస్‌లో పోసి సిప్ చేయడం మంచి అనుభూతిని ఇస్తుంది. 


Mocha Frappuccino చాకోలేట్ అండ్ కాఫీ. మరో మంచి కాంబినేషన్. స్ట్రాంగ్ కాఫీ, పాలు, కొద్దిగా చాకోలేట్ మిశ్రమం, ఇంకొన్ని ఐస్ క్యూబ్స్ ఉంటే చాలు. పైన క్రీమ్‌తో అలంకరించి సర్వ్ చేస్తే అద్భుతమైన రుచితో పాటు చూసేందుకు కూడా బాగుంటుంది. 


Caramel Macchiato ఈ కాఫీలో రుచులన్నీ లేయర్స్ గా ఉంటాయి. ఓ గ్లాసులో పాలు తీసుకుని ఇందులో కోల్ట్ కాఫీ, కేరామెల్ మిశ్రమం, కొన్ని ఐస్ క్యూబ్స్ వేయాలి. తేలిగ్గా కలపాలి. అంతే అద్భుతమైన రుచి, సువాసనతో కేరామెల్ మేషియాటో మీ సొంతం.


Minty Cold Coffee మీ టేస్టింగ్ బడ్స్‌ను యాక్టివ్ చేసే అద్భుతమైన కాఫీ ఇది. కాఫీని చల్లారనిచ్చిన తరువాత అందులో పాలు, మింట్ ఎక్స్‌ట్రాక్స్ లేదా పుదీనా ఆకులు వేసి కొద్దిగా షుగర్ కలిపి బాగా కలపాలి. ఐస్ క్యూబ్స్‌తో సర్వ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది.


Nutella Iced Latte న్యూటెల్లా ఇష్టంగా తినేవారికి మంచి గేమ్ ఛేంజర్ లాంటిది. కాఫీని చిల్డ్ అయ్యేంతవరకూ ఉంచాలి. ఆ తురవాత ఇందులో ఓ స్పూన్ న్యూటెల్లా పూర్తిగా కరిగేంతవరకూ కలపాలి. అందులో కొద్దిగా పాలు, ఐస్ క్యాబ్స్ కలిపి చాకోలేట్ మిశ్రమం యాడ్ చేయాలి. మీక్కావల్సిన న్యూటెల్లా ఐస్డ్ లాటే సిద్ధం.


Coconut Cold Coffee మిక్స్డ్ బ్రూ కాఫీని కోకనట్ క్రీమీ పాలుతో కలిపి కొద్దిగా స్వీట్నర్ కలపాలి. బాగా కలిపి అందులో కొద్దిగా ఐస్ క్యూబ్స్ కలిపి తాగాలి. మంచి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిదని అంటారు. 


Also read: Breakfast Precautions: ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ 5 టిఫిన్లు తింటే అంతే సంగతులు, తస్మాత్ జాగ్రత్త



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook