Blackberries Uses: బ్లాక్‌బెర్రీస్ తింటున్నారా? తినకపోతే ఇప్పుడే తినేయండి..ఎందుకంటే!
Blackberries Health Benefits: బ్లాక్‌బెర్రీ అనే పండు పేరు ఎప్పుడైనా విన్నారా? అయితే ఈ పండు మన దేశంలో ఎక్కువగా లభించకపోయినా.. దీని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీవితంలో ఒక్కసారైనా ఈ పండు తింటే మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Blackberries Health Benefits: బ్లాక్‌బెర్రీ పండులో అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. మన దేశంలో ఎక్కువగా లభించే మల్బరీ పండ్లలా కనిపిస్తాయి ఇవి. ఈ బ్లాక్‌బెర్రీస్ తినడం వల్ల ఆరోగ్యవంతంగా జీవించేందుకు కావాల్సిన పోషకాలు అన్ని లభిస్తాయని తెలుస్తోంది. ప్రకృతి మనకు ఇచ్చిన గొప్ప వరంగా ఈ బ్లాక్ బెర్రీస్‌ను స్వీకరిస్తారు.
తీపి తినేవారికి తియ్యని కబురు
ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ తీసుకునే వాళ్లు.. వారి వారి ఆహారపు అలవాట్లపై చాలా కఠినంగా ఉంటారు. మరీ ముఖ్యంగా తీపి పదార్థాలు తినేందుకు చాలా ఆలోచిస్తారు. కానీ, ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా తినగలిగిన ఒకే ఒక్క తియ్యని పండు బ్లాక్‌బెర్రీస్. ఇందులో ఉండే తీపి ఆరోగ్యానికి హాని కలిగించేది కాదు. అధిక బరువు లేదా స్థూలకాయం, మధుమేహ వ్యాధి లాంటి సమస్యలు ఉన్న వారు కూడా బ్లాక్‌బెర్రీస్ తినొచ్చు. అందుకు కారణం బ్లాక్‌బెర్రీస్‌లోని గ్లిసెమిక్ ఇండెక్స్. ఇది తిన్న వెంటనే శరీరంలో బ్లడ్ షుగర్ వెంటనే పెరగదని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు, ఫిట్‌నెస్ పై దృష్టి పెట్టేవారు కూడా బ్లాక్‌బెర్రీస్ ను ఎండబెట్టుకొని తినొచ్చు.
బ్లాక్‌బెర్రీస్ Vs ఇండియన్ బ్లాక్‌బెర్రీస్ Vs మల్బరీ
బ్లాక్‌బెర్రీస్ అంటే మన దేశంలో దొరికే ఇండియన్ బ్లాక్‌బెర్రీస్ కానేకాదు. ఇండియన్ బ్లాక్‌బెర్రీస్ అనగా నేరేడు పండ్లు అని అర్థం. అయితే మన దేశంలో దొరికే నేరేడు పండ్లలో కూడా బ్లాక్‌బెర్రీస్ లోని పోషకాలు నిండి ఉన్నాయి. అయితే కొందరు మల్బరీ పండ్లను చూసి అవి బ్లాక్ బెర్రీస్ అనే పొరపడే అవకాశం ఉంది. కానీ, అవి రెండు వేర్వేరు. మల్బరీ పండ్లు చూసేందుకు బ్లాక్‌బెర్రీలను పోలి ఉంటాయి కానీ, వీటి రుచి వేరు.
బ్లాక్‌బెర్రీలతో మధుమేహానికి చెక్!
శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం చాలా మంది బ్లాక్‌బెర్రీలను కొన్ని వేల ఏళ్ల నాటి నుంచి తింటున్నారు. అయితే అడవిలో ఆదిమానవుల నాటి కాలం నుంచి అడవిలో బ్లాక్‌బెర్రీలను వెతికి మరీ తినేవారట. వీటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహ వ్యాధితో బాధపడే వారికి ఇది ఇన్సులిన్‌లా పనిచేస్తుందట. ఈ బ్లాక్‌బెర్రీలను తినడం వల్ల షుగర్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు.
క్యాన్సర్ బారి నుంచి కాపాడుతుంది?
అవును, బ్లాక్‌బెర్రీ పండు యాంటీ క్యాన్సర్ గుణాలను కలిగి ఉంది. అంటే మన శరీరంలో క్యాన్సర్ వచ్చే ముప్పును తగ్గించే శక్తి ఎక్కువగా ఉందని అంచనా. దీనికి ప్రధాన కారణం బ్లాక్‌బెర్రీలలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు. మన శరీరంలోని విరివిగా తిరికే ఫ్రీ రాడికల్స్‌ని అదుపుచేసి క్యాన్సర్ ముప్పును నివారిస్తుంది.
ఆడవాళ్లలో గర్భిణీలకు పెద్ద వరం
నెలసరి వల్ల ఆడవాళ్లలో రక్తస్రావం.. అలాగే గర్భవతులకు జరిగే బ్లీడింగ్ వంటి సమస్యలకు బ్లాక్‌బెర్రీస్ నియంత్రిస్తాయి. గర్భిణీలు ఇవి తినడం వల్ల బిడ్డకు ఆరోగ్యం. తల్లీ, బిడ్డ ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ప్రెగ్నెన్సీని కోల్పోవడం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
చదువుకునే పిల్లలకు మంచిది
మీరు పోటీ పరీక్షలకు లేదా సాధారణ పిల్లల స్కూల్ పరీక్షల అయినా కావాల్సింది చురుకైన ఆలోచనలు. అలాంటి వాటికి బ్లాక్‌బెర్రీలు ఓ వరం. మెదడును చురుకుగా ఉంచుతాయి. శాస్త్రవేత్తలు ఎలుకల మీద జరిపిన ప్రయోగాల్లో భాగంగా ఈ విషయం బయటపడింది.
బ్లాక్‌బెర్రీలలో అద్భుత ఆరోగ్య రహస్యాలు
మన రోజూ తినే అన్నం లేదా ఇతర ఆహారపు పదార్ధాల ద్వారా మనకు కావాల్సిన శక్తి లభిస్తుంది. కానీ, చాల మందికి సూక్ష్మ పోషకాలు దొరకడం కష్టంగా మారింది. ఆ విషయానికొస్తే బ్లాక్ బెర్రీలు గొప్ప శక్తిగా పనిచేస్తాయి. విటమిన్ - సి, విటమిన్ - కే, మాంగనీస్, ఐరన్, కాల్షియమ్ లాంటి ఎన్నో పౌషకాలు వాటిలో లభిస్తాయి. 100 గ్రాముల బ్లాక్‌బెర్రీలలో 5 నుంచి 6 గ్రాముల ఫైబర్ ఉండడం మీ పొట్టకు చాలా మంచిది. అంతే కాదు బ్లాక్‌బెర్రీలలో ప్రోటీన్ కూడా ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి