Leftover Rice Dosa Recipe: ప్రతి రోజు చాలా మంది ఇళ్లలో వండిన అన్నం మిగిలిపోతూ ఉంటుంది. తెలంగాణలో చాలా మంది మిగిలిపోయిన అన్నంతో వడియాలు కూడా వేసుకుంటారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. మిగిలిన అన్నంతో చాలా రెసిపీలను తయారు చేసుకోవచ్చు. మిగిలిన అన్నాన్ని ప్రతి రోజు బయట పడేయకుండా దోశలు కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న దోశలను పల్లీలతో తయారు చేసిన చట్నీతో కలిపి తీసుకుంటే మంచి రుచితో పాటు ఆరోగ్యాన్ని పొందుతారు. అయితే ఈ రెసిపీని తయారు చేసుకోవడం చాలా సులభం. అయితే ఈ మిగిలిపోయిన అన్నంతో ఎలా దోశలు తయారు చేసుకోవాలో? వాటికి కావాల్సిన పదార్థాలేంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కావలసిన పదార్థాలు:
1 కప్పు మిగిలిపోయిన అన్నం
1/2 కప్పు రవ్వ
1/2 కప్పు పెరుగు
1/2 టీస్పూన్ ఉప్పు
1/4 టీస్పూన్ బేకింగ్ సోడా
నీరు (తగినంత)


తయారీ విధానం:
ఒక గిన్నెలో మిగిలిపోయిన అన్నాన్ని పెద్ద కప్పులో తీసుకోవాల్సి ఉంటుంది.
అందులోనే రవ్వ, పెరుగు, ఉప్పు, బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్‌ చేయాల్సి ఉంటుంది.
కొద్ది కొద్దిగా నీరు పోస్తూ బ్యాటర్‌ను ఉండలు లేకుండా బాగా కలుపుకోవాల్సి ఉంటుంది.
లేకపోతే ఈ మిశ్రమాన్ని గ్రైడర్‌లో వేసి కూడా బాగా మిక్సీ పట్టుకోవాలి.
పిండిని 15 నంచి 20 నిమిషాలు పక్కన పెట్టి నానబెట్టాలి.
ఒక నాన్-స్టిక్ పాన్ వేడి చేసి దానికి నూనె రాసి, ఒక టేబుల్ స్పూన్ పిండిని పోసి దోశగా వేయాలి.
దోశ చుట్టూ నూనె చల్లుతూ, బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి.
చట్నీ, సాంబార్‌తో వేడి వేడిగా సర్వ్ చేసుకుని తింటే భలే ఉంటుంది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


పల్లి, పుట్నాల చట్నీ:
ఈ చట్నీ తయారు చేసేందుకు ముందుగా వేయించిన శనగలను, పుట్నాలను గ్రైండర్ జార్‌లో వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పెరుగు, ఉప్పు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి వేసి మెత్తగా మిక్సీ కొట్టుకోవాల్సి ఉంటుంది. 
చట్నీని బాగా మిక్సీ పట్టిన తర్వాత తగినంత నీటిని వేసుకుని మరో సారి కూడా రుబ్బుకోవాలి.
ఆ తర్వాత పోపు కోసం పాన్‌లో నూనె వేడి చేసి అందులో ఎండు మిరపకాయు, పోపు దినుసులు, కరివేపాకు వేసుకుని బాగా వేయించుకుని చట్నీలో మిక్స్‌ చేసుకుంటే అంతే సులభంగా రెడీ అయిన్నట్లే. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి