Lemon Benefits: విటమిన్ సి సమృద్ధిగా లభించే నిమ్మకాయతో అద్భుత ప్రయోజనాలున్నాయి. కేవలం ఆరోగ్యం కోసమే కాదు..అందాన్ని పరిరక్షించుకోవడంలో నిమ్మకాయకు మించింది లేదు. అదెలాగో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిమ్మకాయల్లో ఔషధగుణాలు చాలా ఎక్కువ. నిమ్మతొక్క కూడా మేలు చేకూర్చేదే. నిమ్మలో విటమిన్ సి, విటమిన్ బి, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు ఇలా అన్నీ పుష్కలంగా లభిస్తాయి. సాధారణంగా నిమ్మకాయల్ని అందుకే ఆరోగ్యం కోసం ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే నిమ్మ బెస్ట్ యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది. ఇందులో ఉండే 5 శాతం సిట్రిక్ యాసిడ్ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే నిమ్మతో ఆరోగ్యమే కాదు అందం కూడా పరిరక్షించుకోవచ్చని చాలామందికి తెలియదు. అందాన్ని రెట్టింపు చేయడమే కాకుండా..చర్మ సమస్యలు రాకుండా చేస్తుంది. 


అందాన్ని ఎలా పరిరక్షించుకోవాలి


నిమ్మకాయను సగం కోసి..అందులో తేనె కొద్దిగా వేసి ముఖానికి, చేతులు, మెడ, కాళ్లకి రుద్దుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి 3-4 సార్లు చేస్తే..చర్మం కాంతివంతంగా మారుతుంది. ముడతలు, నల్లటి మచ్చలు ఉంటే తొలగిపోతాయి. నిమ్మలో ఉండే విటమిన్ సి కొలాజన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మారేలా చేస్తుంది. నిమ్మతొక్కతో పళ్లను రద్దుకుంటే..పళ్లపై ఉండే ఓ విధమైన పసుపురంగు పోతుంది. పళ్లు తెల్లగా మెరుస్తాయి. కేవలం పావు స్పూన్ బేకింగ్ సోడాను నిమ్మరసం కలిపి పళ్లు తోముకోవాలి. ఇక వేసవిలో వేడి కారణంగా పెదవులు నల్లగా మారిపోతుంటాయి. రాత్రివేళ పడుకునేముందు..నిమ్మరసం కొద్దిగా తెనె కలిపి రాసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే పెదవులు అందంగా మారుతాయి.


అన్నింటికంటే ముఖ్యంగా ముఖంపై మొటిమల సమస్యను కూడా నిమ్మతో దూరం చేసుకోవచ్చు. నేరుగా నిమ్మరసాన్ని మొటిమలపై క్రమం తప్పకుండా కొన్ని రోజులపాటు రాసుకోవాలి. పది నిమిషాల తరువాత చల్లని నీళ్లతో కడగాలి. నిమ్మలో ఉండే ఆస్కార్బిక్ యాసిడ్ మొటిమల్ని దూరం చేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు తిరిగి రాకుండా చేస్తాయి. ఇక మృదువైన చర్మం కావాలంటే..టీ స్పూన్ ఆరెంజ్ జ్యూస్‌లో ఒక టీ స్పూన్ నిమ్మరసం కలిపి..అందులో నిమ్మ తొక్క పొడి కూడా కొద్దిగా కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకుని ఓ అరగంట తరువాత చల్లనినీళ్లతో కడగాలి. ఇలా వారానిరి రెండుసార్లు చేస్తే అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది.


ముఖంపై ముడతలు తొలగించుకునేందుకు బొప్పాయి రసంలో నిమ్మ తొక్క పొడి కలుపుకుని రాసుకోవాలి. అరగంట ఉంచుకుని నీళ్లతో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే ముడతలు పోవడమే కాకుండా వృద్ధాప్య ఛాయలు పోతాయి. 


Also read: Nonstick Pans: నాన్‌స్టిక్‌లో వండితే అంత ప్రమాదకరమా.. ఏయే ఆహార పదార్ధాల్ని వండకూడదు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook