COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Joint Pain Relief In 7 Days: ఆధునిక జీవనశైలి కారనంగా చాలా మందిలో దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తినడం వల్ల  యూరిక్ యాసిడ్ సమస్యలు కూడా వస్తున్నాయి. దీని కారణంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కీళ్ల నొప్పుల బారిన పడుతున్నారు. మరి కొందమందిలో యూరిక్‌ యాసిడ్‌ పెరిగి వేళ్లలో స్ఫటికాలుగా కూడా ఏర్పడుతోంది. దీని కారణంగా శరీరమంతా నొప్పులు, వాపులు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే నొప్పులు తీవ్రతరమయ్యే అవకాశాలున్నాయి.  


యూరిక్ యాసిడ్ అద్భుత చిట్కాలు:
ఊబకాయాన్ని నియంత్రించుకోవాలి:

చాలా మందిలో శరీర బరువు పెరగడం కారణంగా కూడా యూరిక్‌ యాసిడ్‌ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే అధిక బరువుతో పాటు కీళ్ల నొప్పులతో బాధపడేవారు తప్పకుండా శరీర బరువును తగ్గించుకోవాల్సి ఉంటుంది. దీని కోసం ఆహారాలను డైట్‌ పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుంది.


Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?


విటమిన్ సి ఉన్న ఆహారాలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది:
యూరిక్ యాసిడ్ నియంత్రించేందుకు విటమిన్‌ సి అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఆహారాలను ప్రతి రోజు తీసుకోవడం వల్ల గౌట్‌ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు కూడా నియంత్రలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రతి రోజు నిమ్మ, కివీ, నారింజ, స్వీట్ లైమ్‌ని తీసుకోవాల్సి ఉంటుంది.


ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి:
ఆల్కహాల్ అతిగా తీసుకునేవారిలో కూడా యూరిక్‌ యాసిడ్‌ సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇప్పటికే కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఆల్కహాల్‌కు దూరంగా ఉండాల్సి ఉంటుంది. 


తక్కువ పరిమాణంలో ప్యూరిన్ ఉన్న ఆహారాలు తీసుకోండి:
శరీరంలోని యూరిక్‌ యాసిడ్‌ సమస్యలను తగ్గించుకోవడానికి తక్కువ ప్యూరిన్ గల ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజు  పాల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవడం వల్ల సులభంగా యూరిక్‌ యాసిడ్‌ను తగ్గించుకోవచ్చు. 


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook