Common Reasons for Unhappy in Life: అభివృద్ధికి కొలమానం సంతోషమా.. డబ్బు సంపాదించడమా.. చాలామంది డబ్బుతోనే అన్ని సమస్యలు పోతాయని, సంతోషంగా ఉండగలమని నమ్ముతారు. కానీ అది పూర్తిగా అసత్యం. డబ్బు ఉన్నంత మాత్రానా మనిషి సంతోషంగా ఉంటాడనే గ్యారెంటీ లేదు. చాలామంది మంచి లైఫ్‌ను లీడ్ చేస్తున్నప్పటికీ తెలియని అసంతృప్తితో బతుకుతుంటారు. ఈ అసంతృప్తి జీవితంలో సంతోషాన్ని దూరం చేస్తుంది. మనిషి తన జీవితంలో సంతోషాన్ని ఎందుకు కోల్పోతాడంటే.. ముఖ్యంగా 5 కారణాల వల్ల.. అవేంటో ఇప్పుడు చూద్దాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1)  ఉన్నదానితో సంతృప్తి చెందకపోవడం : ఇవాళ నీవు పొందుతున్న జీవితం పట్ల కృతజ్ఞత ఉండకపోగా లేని పోని కంప్లైంట్స్ ఉంటాయి. ఉదాహరణకు.. ఇప్పుడున్న ఇల్లు కన్నా పెద్ద ఇల్లు లేదా ఇప్పుడున్న కారు కన్నా పెద్ద కారు ఉంటే సంతోషంగా ఉండగలమని భావిస్తారు. అంటే.. మీ సంతోషానికి మీరే హద్దులు గీసుకుంటున్నారని అర్థం. మీ హ్యాపీనెస్‌ను వెయిటింగ్ లిస్టులో పెడుతున్నారని అర్థం.  పోనీ.. ఆ ఇల్లు లేదా కారు కొన్న తర్వాతైనా ఎప్పటికీ మీరు సంతోషంగా ఉండగలరా అంటే అవునని చెప్పడం కష్టం. కాబట్టి లేని పోని షరతులు, హద్దులు పెట్టుకొని సంతోషాన్ని దూరం చేసుకోవద్దు.


2) ఇతరులతో పోలిక : 


ఇతరులతో పోల్చుకోవడమనేది మిమ్మల్ని మీరు టార్చర్ చేసుకోవడమే. ఇతరుల సక్సెస్‌ మన సంతోషానికి కొలమానం కావొద్దు. పొరుగింటి వ్యక్తి కారు లేదా బంగ్లా కొన్నాడని.. వాళ్ల పిల్లలు చాలా పెద్ద స్కూళ్లలో చదువుతున్నారని.. నేనెప్పుడు అలా ఉండగలనని మదనపడవద్దు. ఇతరులతో పోల్చుకోవడం మిమ్మల్ని ఆత్మన్యూనతకు గురిచేస్తుంది. మీలో అసంతృప్తిని, ఒత్తిడిని పెంచుతుంది. అలాంటి పరిస్థితిలో ఒక చిరునవ్వు వికసించడం కూడా కష్టమవుతుంది. కాబట్టి ఇతరులతో పోలిక మంచిది కాదు.


3) మీ పరిస్థితికి ఇతరులను నిందించడం : 


పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా సరే.. మీరే బాధ్యత తీసుకోవాలి. ఎలాంటి పరిస్థితికైనా మీరు జవాబుదారీగా ఉండాలి. అంతే తప్ప ఇతరులపై దాన్నినెట్టవద్దు. మీ పరిస్థితికి వారిని నిందించవద్దు. ఇది మీ పట్ల అందరిలో అగౌరవాన్ని ఏర్పరుస్తుంది. ఆ విషయం మీకూ అర్థమవుతూనే ఉంటుంది. అప్పటినుంచి ఇక సంతోషమనేది మీ ముఖంపై కనిపించదు.


4) పర్ఫెక్షన్ కోసం పాకులాడవద్దు :


ప్రతీ పనిలో పర్ఫెక్షన్ సాధ్యపడదు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్లడమే. అంతే తప్ప ఏది చేసినా పర్ఫెక్ట్‌గా చేయాలనుకుంటే ఇక జీవితంలో ముందుకు సాగలేరు.  పడుతూ లేవడమే జీవితమంటే అనే సత్యాన్ని గుర్తెరగాలి.అంతే తప్ప పర్ఫెక్షన్ కోసం పాకులాడితే అసంతృప్తి మాత్రమే మిగులుతుంది. 100 శాతం ప్రయత్నించండి.. ఫలితం 100 శాతం ఉంటుందా లేదా అనే దాని కన్నా మీ  ప్రయత్నం చాలా ముఖ్యమని గుర్తించండి.


5) ఒంటరితనం :


ఈరోజుల్లో మొబైల్ వినియోగం బాగా పెరిగిపోయింది. వర్చువల్ వరల్డ్‌లో విహరించే యువతరం ఎక్కువైంది. చుట్టూ ఫ్యామిలీ ఉన్నా, ఫ్రెండ్స్ ఉన్నా, ఎక్కడున్నా సరే అనుక్షణం మొబైల్‌లో తలదూర్చడమే జీవితమైపోయింది. రాను రాను ఈ ధోరణి వ్యక్తిలో ఒంటరితనాన్ని పెంచుతుంది. అది తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది. అలాంటి పరిస్థితిలో ఇక సంతోషం అనే మాటే ఉండదు. కాబట్టి అందరితో బాగుండాలి. ముఖ్యంగా మనవాళ్లతో ఎప్పుడూ మాట్లాడుతుండాలి. అప్పుడే ఒంటరితనం దరిచేరదు.


జీవితం చాలా చిన్నది. కానీ నిజాయితీగా, అర్థవంతంగా బతకడానికి ఈ జీవితం చాలా పెద్దది. ఇప్పుడున్న పరిస్థితికి చింతించవద్దు. రేపటి అందమైన భవిష్యత్తు కోసం నిజాయితీగా కష్టపడాలి. మీరు సంతోషంగా ఉంటూ వీలైతే ఇతరులను సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించాలి. సంతోషమంటే ఎక్కడో ఉండదు. అది మీలోనే ఉంటుంది. మిమ్మల్ని మీరు తెలుసుకోవడంలో, అర్థం చేసుకోవడంలో ఉంటుందని గ్రహించాలి. 



Also Read: TS Inter Supplementary Results 2022: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు నేడే.. విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి  


Also Read: బంగారం ప్రియులకు శుభవార్త.. తగ్గిన పసిడి ధర! హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook