Gold Price Today 30 August: బంగారం ప్రియులకు శుభవార్త.. తగ్గిన పసిడి ధర! హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే

Gold Price Today 30 August 2022, Today Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,150 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,430గా ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 30, 2022, 10:45 AM IST
  • తగ్గిన బంగారం ధర
  • నేటి బంగారం-వెండి రేట్లు ఇవే
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఎంతంటే
Gold Price Today 30 August: బంగారం ప్రియులకు శుభవార్త.. తగ్గిన పసిడి ధర! హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే

Gold Price Today 30 August 2022: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటుచేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. ఒక రోజు బంగారం ధర పెరిగితే, మరో రోజు తగ్గుతుంది.. ఇంకో రోజు మాత్రం స్థిరంగా ఉంటుంది. కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో పసిడి నిల్వ, డాలర్ విలువ, పలు దేశాల భౌతిక పరిస్థితులు లాంటి పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. అయితే పసిడి ధరలు పెరిగినా లేదా తగ్గినా వ్యాపారాలు మాత్రం జోరుగానే సాగుతాయి. 

ఇటీవల పెరుగుతూ వచ్చిన పసిడి ధరలకు 2 రోజులుగా బ్రేక్ పడింది. నేడు బంగారం ధర స్వల్పంగా తగ్గింది. శనివారం (ఆగష్టు 30) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 47,150లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,430లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ. 150.. 24 క్యారెట్ల ధరపై రూ. 170 తగ్గింది.  

# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,600లుగా ఉంది. 
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 47,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,430గా నమోదైంది. 
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,650గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,000 వద్ద కొనసాగుతోంది. 
# బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,200.. 24 క్యారెట్ల ధర రూ. 51,490గా నమోదైంది. 
# కేరళలో 22 క్యారెట్ల ధర రూ. 47,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,430గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,150 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,430గా ఉంది. 
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 47,150.. 24 క్యారెట్ల ధర రూ. 51,430గా నమోదైంది. 
# విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ. 47,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,430 వద్ద కొనసాగుతోంది. 

మరోవైపు వెండి ధర కూడా బంగారం ధర బాటలోనే నడిచింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ. 54,000లగా కొనసాగుతోంది. నిన్నటితో పోల్చుకుంటే వెండి ధరలో ఏకంగా రూ. 800 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 54,000లుగా ఉండగా.. చెన్నైలో రూ. 60,000లుగా ఉంది. బెంగళూరులో రూ. 60,000గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 60, 000లుగా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో కిలో వెండి ధర రూ. 60,000ల వద్ద కొనసాగుతోంది. 

Also Read: Pooja Hegde Hot Pics: పూజా హెగ్డే హాట్ ట్రీట్.. బుట్టబొమ్మ వాటినే టార్గెట్ చేసిందిగా!
Also Read: Tamannaah Bhatia Pics: పింక్ డ్రెస్‌లో తమన్నా భాటియా.. మిల్కీ బ్యూటీ అందాలే వేరు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News