COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Loose Motion Remedies: అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందిలో తీవ్ర పొట్ట సమస్యలు వస్తున్నాయి. జీవనశైలిలో మార్పుల కారణంగా కూడా జీర్ణక్రియ తీవ్రంగా దెబ్బతింటోంది. దీంతో లూజ్‌ మోషన్‌, అతిసారం వంటి సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలు ఎక్కువగా వయసు మళ్ళిన వారిలో వస్తున్నాయి. కాబట్టి ఈ సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మార్కెట్‌లో లభించే మందులకు బదులుగా అనారోగ్య నిపుణులు సూచించిన ఈ కింది సూపర్‌ ఫుడ్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల సులభంగా లూజ్‌ మోషన్‌, అతిసారం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 


వీటిని తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది:
అరటిపండ్లు:

అరటిపండ్లలో అధిక పరిమాణంలో పొటాషియం, పెక్టిన్‌ గుణాలు లభిస్తాయి. కాబట్టి జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఎలక్ట్రోలైట్ లోపాన్ని అధిగమించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో పాటు శరీరం దృఢంగా తయారవుతుంది. 


బియ్యం, పప్పు ఖిచ్డీ:
లూజ్ మోషన్ సమస్యలతో బాధపడేవారు బియ్యం, పప్పు ఖిచ్డీని ఆహారంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇలా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పోషకాహారం లోపం ఇతర సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఇలా ఖిచ్డీని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


ఉడికించిన బంగాళాదుంపలు:
లూజ్ మోషన్, జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారికి ఉడికించిన బంగాళాదుంప కూడా ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో అధిక పరిమాణంలో కార్బోహైడ్రేట్లు  లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 


పెరుగు:
పెరుగులో ప్రోబయోటిక్స్ గట్-ఫ్రెండ్లీ బ్యాక్టీరియా పొట్టకు అనేక రకాలుగా మేలు చేస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియపై ప్రభావం చూసి మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. కాబట్టి తరచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు పెరుగును తీసుకోవాల్సి ఉంటుంది. 


దానిమ్మ:
దానిమ్మ గింజలు లేదా రసం కూడా విరేచనాల సమస్య నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో లభించే యాంటీఆక్సిడెంట్లు అనేక రకాల పొట్ట సమస్యల నుంచి రక్షిస్తాయి. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..