Lucky gifts if you gave or receive these 5 things from some one: ఈ ప్రపంచంలో బహుమతులు ఇవ్వడం, తీసుకోవడం సహజం. పెళ్లిళ్లు, పుట్టిన రోజు, పెళ్లి వార్షికోత్సవం, లవర్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, పండగలు, నూతన సంవత్సరం ఇలా అనేక సందర్భాలలో రకాల బహుమానాలను కుటుంబ సబ్యులకు, స్నేహితులకు లేదా సహచరులకు ఇస్తుంటాము. ఈ బహుమతుల ద్వారా ఇచ్చిన వారు, తీసుకున్న వారు ఆనంద పడుతుంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గణేశుడు:
అయితే జ్యోతిష్యం, వాస్తు విజ్ఞానశాస్త్రం ప‌రంగా కొన్ని బహుమతులను ఇచ్చినా, పుచ్చుకున్నా అదృష్టం కలసి వస్తుందంట. ఇంతకీ ఆ విలువైన బహుమతులేలేంటో ఓసారి చూద్ధాం. గణేశుడి ఫోటో లేదా పెయింటింగ్‌ను బహుమతిగా ఇవ్వడం లేదా స్వీకరించడం చాలా శుభప్రదమైనవి. దీని వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి. గణేశుని అనుగ్రహంతో జీవితంలోని కష్టాలన్నీ కూడా తీరిపోతాయి.


వెండి:
స్వచ్ఛమైన లోహాలలో వెండి ఒకటి. వాస్తు శాస్త్రం ప్రకారం వెండితో చేసిన బహుమతులును ఇతరులకు ఇవ్వడం లేదా స్వీకరించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. దాంతో ఇంట్లో డబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయి. ల‌క్ష్మీ దేవి క‌టాక్షం ఎల్ల‌ప్పుడూ ఉంటుంద‌ట‌.


ఏనుగు:
హిందూ మతంలో ఏనుగు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఏనుగు గణేశుడి వాహనం. ఏనుగు బొమ్మను బహుమతిగా ఇచ్చినా లేదా తీసుకున్నా చాలా శ్రేయస్కరం. వెండి, ఇత్తడి లేదా చెక్కతో ఉండే ఏనుగులను బహుమతిగా ఇస్తే మంచిది. గాజుతో చేసిన ఏనుగు బొమ్మను బహుమతిగా ఇవ్వొద్దు.


గుర్రం :
ఏడు తెల్ల‌ని గుర్రాలు ప‌రిగెడుతున్న‌ట్టుగా ఉండే పెయింటింగ్‌ను బహుమతిగా ఇచ్చినా లేదా తీసుకున్నాచాలా శుభం జరుగుతుంది. తెల్ల‌ని గుర్రాల ఫొటోను ఇచ్చిన వారు లేదా తీసుకున్న వ్య‌క్తులు త‌మ త‌మ రంగాల్లో అద్భుతంగా రాణిస్తూ.. ధ‌నం బాగా సంపాదిస్తార‌ట‌. 


దుస్తులు:
మనం ప్రతిశుభ కార్యంలో వస్త్రాలను మన బందువులకు అందిస్తాం. వీటిని బ‌హుమ‌తి రూపంలో పొందినా లేదంటే ఎవ‌రికైనా ఇచ్చినా ఇరువురికి మంచే జ‌రుగుతుంద‌ట‌. అయితే న‌లుపు రంగు దుస్తుల‌ను మాత్రం బహుమతులుగా ఇవ్వ‌కూడ‌దు.


Also Read: నేను లైంగిక వేధింపులకు గురయ్యా.. బాలీవుడ్ క్వీన్ కంగ‌నా షాకింగ్ కామెంట్స్!


Also Read: Pushpa Parat 2: పుష్ప‌ 2లో బాలీవుడ్ స్టార్.. ఆ పాత్ర కోసమేనా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.