How To Break shivratri Fasting: ఇవాళ మహా శివరాత్రి సందర్భంగా శివ భక్తులు ఉపవాస దీక్ష చేపడుతారు. రాత్రంతా జాగారం చేస్తారు. ఉపవాసం ఉండేవారు.. ఉపవాస దీక్ష విడిచేటప్పుడు సాత్విక ఆహారమే తీసుకోవాలి. ఇందుకు సాబుదాన (సగ్గు బియ్యం)తో చేసిన పదార్థాలైతే ఆరోగ్యానికి మంచిది. రోజంతా ఉపవాసం ఉండటం వల్ల శరీరం అలసట, నీరసానికి గురవుతుంది కాబట్టి.. సాబుదాన వంటి ప్రొటీన్, అమైనో యాసిడ్స్, కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే శరీరానికి త్వరగా ఎనర్జీ అందుతుంది. అంతేకాదు, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. సాబుదానతో చేసే రెసిపీస్ వివరాలను ఇప్పుడు చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాబుదాన కీర్ :


పండగల సమయంలో ఇళ్లల్లో కీర్ రెసిపీ చేసుకోవడం సహజం. సాబుదానతో కలిపి చేసే కీర్‌ రుచికరంగా ఉండటంతో ఆరోగ్యానికి మంచిది. ఈ రెసిపీ కోసం ముందుగా సాబుదానను ఒక కప్పు నీటిలో నానబెట్టాలి. సాబుదాన కాస్త సాఫ్ట్‌గా అయ్యాక.. దానికి పాలు, సుగర్, యాలకుల పొడి కలిపి మిక్సీ పట్టాలి. ఆ మిశ్రమాన్ని డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకోవాలి. అంతే కేవలం 30 నిమిషాల్లో ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు.


సాబుదాన కిచిడీ :


సాబుదాన కిచిడీ కోసం మొదట సాబుదానను ఒక గంట నానబెట్టాలి. ఆ తర్వాత పెనంలో కాస్త నెయ్యిని వేడి చేసి జీలకర్ర, మిరియాలు వేయాలి. ఆ తర్వాత వేరు శెనగలు, ఉప్పు, కారంతో పాటు అందులో సాబుదాన వేసి కలపాలి. చివరలో కొత్తిమీర, పచ్చిమిర్చి వేస్తే సాబుదాన కిచిడీ రెడీ అయినట్లే.


సాబుదాన వడ :


మొదట సాబుదానను నీళ్లలో నానబెట్టాలి. ఆ తర్వాత సాబుదాన, వేరు శెనగలు, పచ్చి మిర్చి, రాక్ సాల్ట్, కారం, చిదిమిన ఆలు, కొత్తిమీర, నిమ్మరసం అన్ని కలిపి మిక్సీ పట్టాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేయాలి. ఆ ఉండలను ఆయిల్‌లో ఫ్రై చేయాలి. వీటిని పెరుగుతో తింటే చాలా బాగుంటుంది.


సాబుదాన చివ్దా:


పెనంపై ఆయిల్ వేసి కరివేపాకు, పచ్చి మిర్చి వేయాలి. అవి కాస్త చిటపటలాడాక
సాబుదాన, కొబ్బరి ముక్కలు, బాదం, జీడిపపప్పు, ఎండు ద్రాక్ష, వేరు శెనగ.. వీటన్నింటిని దోరగా పెనంపై వేయించాలి. కొద్దిగా కారం, రాక్ సాల్ట్, సుగర్ వేసుకుని దించేయాలి. అంతే సాబుదా చివ్దా రెడీ.


సాబుదాన పరాటా :


ఇందుకోసం సాబుదాన, ఉడికించిన ఆలు, వేరు శెనగలు, టమోటాలు, కొత్తిమీర, జీలకర్ర, మిరియాలు వీటన్నింటిని మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమంతో రోటీలు తయారుచేసుకుని మీడియం ఫ్లేమ్‌పై పెనంపై కాల్చాలి. కాస్త నెయ్యి రాస్తే రుచి మరింత బాగుంటుంది. 


Also Read: Shiva Puranam: శివుడి ఒంటిపై బూడిద ఎందుకు ? శివ పురాణం ఏం చెబుతోంది


Also Read: Adipurush Release Date: ప్రభాస్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. ఆదిపురుష్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook