Mahesh Babu Emotional Words:  సోదరుడు రమేష్ బాబు అంత్యక్రియలకు (Ramesh Babu last rites) హాజరుకాలేకపోయిన మహేష్ బాబు... ఆయన మరణంపై భావోద్వేగపూరితంగా స్పందించారు. 'నువ్వు ఎప్పటికీ నా అన్నయ్యవే... ఇప్పుడు, ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను...' అంటూ రమేష్ బాబు ఫోటోతో మహేష్ ట్వీట్ చేశారు. ఇటీవల మహేష్ కరోనా బారినపడటంతో ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో సోదరుడి కడసారి చూపుకు నోచుకోలేకపోయారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'మీరు నాకొక స్పూర్తి.. నా బలం.. నా ధైర్యం.. మీరు నా సర్వస్వం.. మీరే లేకపోయి ఉంటే ఇవాళ నేననే వ్యక్తిని సగం మాత్రమే... మీరు నాకోసం చేసినవాటికి మీకు కృతజ్ఞతలు.. ఇప్పుడిక మీకు విశ్రాంతి... విశ్రాంతి.. ఈ జీవితమే కాదు, మరో జన్మంటూ ఉంటే మీరే ఎప్పటికీ నా అన్నయ్య... మిమ్మల్ని ఇప్పుడు, ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను...' అంటూ మహేష్ తన ట్వీట్‌లో ఎమోషనల్ అయ్యారు. మహేష్ (Mahesh Babu) ట్వీట్‌పై స్పందిస్తున్న అభిమానులు.. 'ఈ దు:ఖ సమయంలో భగవంతుడు మీకు మనోధైర్యాన్ని ఇవ్వాలి..' అని కామెంట్స్ చేస్తున్నారు.



కృష్ణ తనయులు రమేష్ బాబు, మహేష్ బాబు మధ్య మంచి అనుబంధం ఉంది. తన కంటే వయసులో పదేళ్లు పెద్ద అయిన రమేష్ బాబును మహేష్ తండ్రి సమానుడిగా భావిస్తారు. బాల నటులుగా ఈ ఇద్దరు కలిసి 'నీడ' చిత్రంలో నటించారు. రమేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'బజార్ రౌడీ' చిత్రంలో మహేష్ కీలక పాత్రలో నటించారు. 'ఎన్‌కౌంటర్' సినిమా తర్వాత మళ్లీ తెరపై కనిపించని రమేష్ బాబు (Ramesh Babu Death).. నిర్మాతగా మారి సోదరుడు మహేష్‌తో అర్జున్, అతిథి చిత్రాలు నిర్మించారు. సోదరుడితో ఇంత అనుబంధం ఉన్నప్పటికీ.. కరోనా కారణంగా మహేష్ ఆయన అంత్యక్రియలకు హాజరుకాలేకపోయారు. ఇటీవల కరోనా బారినపడటంతో ప్రస్తుతం మహేష్, ఆయన కుటుంబం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా, రమేష్ బాబు అంత్యక్రియలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరిగాయి. కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు.


Also Read: Ramesh Babu last rites: ముగిసిన రమేష్ బాబు అంత్యక్రియలు.. కన్నీటిపర్యంతమైన కృష్ణ..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook