Mango Shake Recipe: వేసవిలో మ్యాంగో షేక్ తాగితే శరీరానికి ఎన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?
Mango Shake Recipe: వేసవి కాలంలో ప్రతి రోజు మ్యాంగో షేక్ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Mango Shake Recipe: భారత దేశంలో ప్రస్తుతం వేసవి కాలం కొనసాగుతుంది. కాబట్టి ఈ సీజన్‌లో మార్కెట్‌లో విచ్చలవిడిగా మామిడి పండ్లు లభిస్తాయి. అంతేకాకుండా ఈ పండ్లంటే ఇష్టం లేని వారుండరు. ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. మ్యాంగో షేక్ కూడా పిల్లలు ఇష్టపడి తాగుతూ ఉంటారు. అయితే వీటిని తాగాడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మొంగో షేక్‌లో పొటాషియం, ఫైబర్, విటమిన్ సి వంటి చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి ఈ షేక్‌ను తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. బరువు పెరగాలనుకునేవారు ప్రతి రోజు ఈ షేక్‌ను తాగడం వల్ల సులభంగా మంచి ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి రోజు మ్యాంగో షేక్ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మ్యాంగో షేక్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
బరువు పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది:
సన్నగా ఉన్నవారు బరువు పెరిగేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బరువు పెరగాలనుకునేవారు తప్పకుండా మ్యాంగో షేక్ తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. మామిడిలో సహజమైన గ్లూకోజ్ ఉంటుంది. కాబట్టి పాలలో కలిపి తాగితే సులభంగా బరువు పెరుగుతారు.
Also read: Gas Cylinder Prices: గుడ్‌న్యూస్, భారీగా తగ్గిన గ్యాస్ ధర, ఇవాళ్టి నుంచి అమలు
జీర్ణవ్యవస్థను దృఢంగా చేస్తుంది:
ఎండా కాలంలో మ్యాంగో షేక్ ప్రతి రోజు తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యలు సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా పొట్టను కూడా చల్లగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
కంటి చూపును మెరుగుపరుచుతుంది:
మ్యాంగో షేక్ కంటి చూపును మెరుగుపరించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి సులభంగా అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా వేసవిలో కంటి వ్యాధులు రాకుండా ఉపశమనం కలిగిస్తుంది. కంటి చూపును మెరుగుపరుచుకునేవారు ప్రతి రోజు ఈ షేక్ తాగాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: Gas Cylinder Prices: గుడ్‌న్యూస్, భారీగా తగ్గిన గ్యాస్ ధర, ఇవాళ్టి నుంచి అమలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook