Memory Power Tips: ఆధునిక పోటీ ప్రపంచంలో విభిన్న రకాల జీవనశైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్లు మనిషి ఆరోగ్యంపై పలు విధాలుగా ప్రభావం చూపిస్తున్నాయి. స్థూలకాయం ప్రధాన సమస్య కాగా మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్ ఇతర సమస్యలుగా ఉన్నాయి. అదే సమయంలో జ్ఞాపకశక్తి క్షీణించడం కూడా అతి ముఖ్యమైన సమస్యగా ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలి కాలంలో చిన్న చిన్న విషయాల్ని కూడా మర్చిపోతున్నారు. వస్తువులు ఎక్కడ పెట్టారో మర్చిపోతూ ఇబ్బంది పడుతున్నారు. ఒక్కోసారి బండి నడుపుతూ వెళ్లాల్సిన చోటు దాటి మరెక్కడికో వెళ్లిపోతున్నారు. చదివింది గుర్తుండటం లేదు. ఈ క్రమంలో మెదడు సామర్ధ్యాన్ని పెంచాల్సిన అవసరం చాలా ఉంది. జ్ఞాపకశక్తిని పెంచే 5 అద్భుతమైన ఆయుర్వేద చిట్కాల గురించి తెలుసుకుందాం..


హెర్బల్ టీ అనేది మెదడు సామర్ధ్యాన్ని, శక్తిని పెంచుతుంది. తరచూ మతిమరపు సమస్య ఉంటే..హెర్బల్ టీ అద్భుతంగా ఉపయోగపడుతుంది. హెర్బల్ టీ తాగడం వల్ల మెదడు పనీతీరు వేగవంతమౌతుంది. మానసిక శక్తి పెరుగుతుంది. ఇంట్లోనే తులసి, పసుపు, వాము, హింగ్ కలిపి స్వయంగా హెర్బల్ టీ తయారు చేసుకోవచ్చు. ఇది శరీరం డీహైడ్రేట్ కాకుండా కూడా కాపాడుతుంది. 


మెదడు పనితీరు పెంచేందుకు చాలా రకాల ఆహార పదార్ధాలుంటాయి. ఇందులో బాదం, కిస్మిస్, ఖర్జూరం, నెయ్యి, జైతూన్ ఆయిల్, పప్పులు, బీన్స్, పన్నీర్, నల్ల మిరియాలు, జీలకర్ర ముఖ్యమైనవి. దీంతోపాటు సీజనల్ ఫ్రూట్స్ కూడా దోహదపడతాయి. శుద్ధమైన ఈ ఆయుర్వేద ఆహార పదార్ధాలు వినియోగిస్తే ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.


అన్నింటికంటే మించి జ్ఞాపకశక్తిని పెంపొందించేందుకు నిద్ర చాలా అవసరం. రోజుకు కనీసం 7-8 గంటల రాత్రి నిద్ర కచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మెదడుకు కూడా విశ్రాంతి అవసరం. సూర్యాస్తమయం తరువాత పడుకుని..సూర్యోదయానికి ముందు లేవడం అలవాటు చేసుకుంటే ఇంకా మంచిది.


మీ మస్తిష్కం పనితీరు పెంచేందుకు ఆక్సిజన్ పుష్కలంగా ఉండాలి. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గితే మనిషికి ప్రమాదకరం. ఆక్సిజన్ సరఫరా ఆగితే ప్రాణాలే పోతుంటాయి. శరీరంలో ఆక్సిజన్ సరైన మోతాదులో ఎప్పుడూ ఉండాలి. దీనికోసం రెడ్, పింక్ కలర్ ఫ్రూట్స్, కూరగాయలు, పుచ్చకాయ, టొమాటో వంటి వస్తువులు తీసుకోవాలి. 


జ్ఞాపకశక్తిని పెంచేందుకు వివిధ రకాల ఆయుర్వేద మూలికలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో అశ్వగంధ, బకోపా, ధూతి, నెయ్యి వంటి పదార్ధాలున్నాయి. వీటిని ఓ క్రమ పద్ధతిలో వినియోగిస్తే మెదడు సామర్ధ్యం పెరుగుతుంది. 


Also read: Diabetes Control Tips: ఎలాంటి ఖర్చు లేకుండా మధుమేహానికి ఇలా 14 రోజుల్లో చెక్‌ పెట్టండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook