Weight Loss Tips: ఎలాంటి వ్యాయామాలు చేయకుండా ఇలా రోటీలతో కేవలం 10రోజుల్లో బరువు తగ్గొచ్చు..
Millet Roti For Weight Loss In Telugu: భారత్‌లో చాలా మంది వివిధ కారణాల వల్ల బరువు పెరుగుతున్నారు. అయితే బరువు తగ్గడానికి వీరు కఠినతర వ్యాయామాలు చేస్తున్నారు. ఇలా వ్యాయామాలు చేయడం వల్ల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.
Millet Roti For Weight Loss In Telugu: భారత్‌లో చాలా మంది వివిధ కారణాల వల్ల బరువు పెరుగుతున్నారు. అయితే బరువు తగ్గడానికి వీరు కఠినతర వ్యాయామాలు చేస్తున్నారు. ఇలా వ్యాయామాలు చేయడం వల్ల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా చాలా మంది ఇదే క్రమంలో గుండె పోటు సమస్యల బారిన పడుతున్నారు. అయితే వ్యాయామాలతో కాకుండా డైట్‌లను అనుసరించి కూడా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. డైట్స్‌లో భాగంగా కొన్ని రకాల ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ డైట్స్‌లో ఆహారంగా హెల్తీ రోటిస్‌ను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా రోటీలను తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడానికి ఎలాంటి రోటీలను డైట్‌లో భాగంగా తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ముఖ్యంగా చాలా మంది ఆధునిక జీవన శైలికారణంగా అల్పాహారంలో భాగంగా అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటున్నారు. అయితే ఇలా చేయడం వల్లే బరువు కూడా పెరుగుతున్నారు. అంతేకాకుండా చాలా మంది ఇదే క్రమంలో మధుమేహం బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఇలాంటి రోటీలతో కూడిన హెల్తీ ఫుడ్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో లభించే ప్రోటిన్లు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలిగిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా తయారవుతుంది.
ఇలా రోటీలను తీసుకోవచ్చా..?:
చాలా మంది ఆధునిక జీవన శైలి కారణంగా వివిధ ఆనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి ఎప్పుడు అనారోగ్య కరమైన ఆహారాలను తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ క్రమంలో వైట్ బ్రెడ్‌ను అస్సలు తినొద్దు. ఇలా చేయడం వల్ల మధుమేహం ఉన్నవారిలో తీవ్ర అనారోగ్య సమస్యలు రావొచ్చని నిపుణులు తెలుపుతున్నారు. వీటిల్లో పిండి పదార్థాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల శరీర బరువు పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిని చేర్చుకోకపోవడం చాలా మేలని నిపుణులు చెబుతున్నారు.
బరువు సులభంగా తగ్గడానికి ఎలాంటి బ్రెడ్‌లను తినాలి:
సులభంగా బరువు తగ్గాలనుకుంటే.. తప్పకుండా మీరు అల్పాహారంలో భాగంగా తృణధాన్యాలతో కూడిన బ్రెడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల హెల్తీగా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలా క్రమం తప్పకుండా ఉదయం పూట టిఫిన్‌లో భాగంగా తీసుకుంటే శరీరంలో ఫైబర్ పరిమాణాలు పెరగే అవకాశాలున్నాయి. కాబట్టి ఇలాంటి ఆహారాలను తీసుకోవాలి. అంతేకాకుండా ఈ క్రమంలో ఓట్స్‌తో తయారు చేసిన రోటీలను కూడా తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి