Mobile Side effects: మీ మొబైల్ ని తల దగ్గర పెట్టుకుంటున్నారా.. అయితే జాగ్రత్త
Mobile Health Effects: టెక్నాలజీ మీద ఆధారపడిన ఈ రోజులలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ అనేది సర్వసాధారణం అయింది. మొబైల్ వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా రాత్రి పూట మొబైల్ వల్ల కలిగే ఇబ్బందులు మీకు తెలుసా?
Mobile Usage Effects: ఈరోజుల్లో చేతులో మొబైల్ లేకపోతే ఏమీ తోచని పరిస్థితి నెలకొని ఉంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు మొబైల్ ఫోన్ వాడే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే వారి దగ్గర నుంచి చదువుకునే పిల్లల వరకు రోజూ మొబైల్ ఫోన్ వాడకం తప్పనిసరిగా మారిపోతుంది. అయితే చాలామంది అర్థరాత్రి నిద్రపోయే వరకు చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటారు. పడుకునేటప్పుడు మొబైల్ ఫోన్ తల దగ్గర పెట్టుకొని పడుకుంటారు. అలారమ్ క్లాక్ గా మొబైల్ ఫోన్ ని వాడేవారు మనలో చాలామంది ఉన్నారు. అయితే ఇలా తలగడ పక్కన మొబైల్ ఫోన్ పెట్టుకొని పడుకోవడం వల్ల తెలియకుండానే ఎన్నో సమస్యలు ఎదురవుతాయి.
మనకు తెలియకుండా సెల్ ఫోన్ కి బాగా అలవాటు పడిపోతున్నాము. సెల్ ఫోన్ వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో వాటి వల్ల మన శరీరం పై పడే దుష్ప్రయోజనాలు అంతకంటే ఎక్కువ ఉన్నాయి అంటున్నారు శాస్త్రవేత్తలు. మరి ముఖ్యంగా సెల్ ఫోన్ వాడకం ఎక్కువ అయితే మనకు మానసిక సమస్యలతో పాటు శారీరక సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉందట. కొంతమందికి గేమ్స్ ఆడుతూ లేక సోషల్ మీడియా చూస్తూ అలాగే ఫోన్ పట్టుకొని పడుకోవడం కూడా అలవాటే. ఇలా మొబైల్ ఫోన్ పక్కన పెట్టుకుని పడుకోవడం వల్ల ఎన్నో చెడు ప్రభావాలు ఎదురవుతాయని వైద్యులు సూచిస్తున్నారు.
మొబైల్ వల్ల సమస్యలు:
రాత్రిపూట మసక వెలుతురులో ఎక్కువ సేపు మొబైల్ ఫోన్ చూడడం వల్ల మన కంటి చూపు మందగిస్తుంది. మొబైల్ నుంచి వచ్చే నీలి కాంతి మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని నిరోధించడం ద్వారా మనలో నిద్రలేమి సమస్యను పెంచుతుంది. అంతేకాదు మొబైల్ నుంచి విడుదలయ్యే రేడియేషన్ వల్ల క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కాబట్టి మీకు నిద్రపోయేటప్పుడు సెల్ ఫోన్ దగ్గర పెట్టుకునే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి.
మొబైల్ ఫోన్ పక్కనే ఉంటే ఎంతసేపు ఏదో ఒకటి చూడాలనిపిస్తుంది తప్ప నిద్రపోవాలి అన్న ఆలోచన మనసుకు రాదు. రాత్రి పూట ఎక్కువసేపు మొబైల్ ఫోన్ చూడడం వల్ల కంటి వెనుక నరాలకు ఇబ్బంది కలుగుతుంది. దీని కారణంగా మెడ నొప్పి, తలనొప్పి వంటి సమస్యలు తరచూ వస్తూ ఉంటాయి. అందుకే పడుకోవడానికి అరగంట ముందు కచ్చితంగా మీ మొబైల్ ఫోన్ ని దూరంగా పెట్టడం అలవాటు చేసుకోండి. మరి ముఖ్యంగా పసిపిల్లల తల్లులు తమ మొబైల్ ఫోన్లు వారికి వీలైనంత దూరంగా ఉంచాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter