Monsoon Season Skin Care: చర్మం పొడిబారడం వంటి సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..!
Monsoon Season Skin Care: వేసవిలో టానింగ్, చలికాలంలో పొడిబారడం, వర్షాకాలంలో జిగట పెరగడం వంటి చర్మ సమస్యలు ప్రతి సీజన్‌లో రావడం సాధరణం. అయితే చలి కాలంలో మాత్రం చర్మంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Monsoon Season Skin Care: వేసవిలో టానింగ్, చలికాలంలో పొడిబారడం, వర్షాకాలంలో జిగట పెరగడం వంటి చర్మ సమస్యలు ప్రతి సీజన్‌లో రావడం సాధరణం. అయితే చలి కాలంలో మాత్రం చర్మంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వానా కాలంలో చర్మం పొరలుగా మారడం, మొటిమలు రావడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. అయితే వీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వర్షాకాలంలో ముఖంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి:
భారత్‌లో ప్రస్తుతం రతుపవనాలు వేగంగా మారుతున్నాయి. అయితే ప్రస్తుతం వానా కాలం మొదలై వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారింది. దీని కారణంగా చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా మేలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే చర్మం నిర్జీవంగా మారి.. చర్మంపై వృద్ధాప్య ప్రభావం పడే అవకాశాలుంటాయి. వర్షాకాలంలో కూడా ముఖ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచే సహజమైన మార్గాలేంటో తెలుసుకుందాం.
ఇవి చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి:
1. నీటి ఆధారిత మాయిశ్చరైజర్:
జిడ్డు చర్మం ఉన్నవారు వర్షాకాలంలో విటమిన్ ఇ క్యాప్సూల్‌లో ఫిల్టర్ వాటర్ మిక్స్ చేసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయండి. ఇలా చేయండం వల్ల చర్మం మెరుగుపడుతుంది.
2. దోసకాయ ఐస్ క్యూబ్స్:
ముఖ చర్మం పొడిగా ఉంటే.. దోసకాయ ఐస్ క్యూబ్స్ దీనికి దివ్యౌషధం కంటే చాలా మంది నిపుణులు భావిస్తారు. దీని కోసం.. దోసకాయ రసం తీసి ఫ్రీజర్‌లో నిల్వ చేయండి. దీనిలో తేనె, నిమ్మరసం మిక్స్ చేయండి. ఇప్పుడు తేలికపాటి చేతులతో ముఖం మీద అప్లై చేయండి.
3. రోజ్ వాటర్:
వానా కాలంలో రోజ్ వాటర్ చర్మం పొడిబారకుండా రక్షిస్తుంది. దీని కోసం చర్మ పొడిగా అనిపించినప్పుడల్లా రోజ్ వాటర్‌ను స్ప్రే చేయండి. అంతే త్వరలోనే ప్రయోజనం పొందుతారు.
4. పెరుగు:
చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి పెరుగు ఉత్తమ మార్గంగా చెప్పొచ్చు. అయితే స్నానం చేసే ముందు.. శరీరమంతా పెరుగును రుద్దండి. ఆ తర్వాత శరీరాన్ని శుభ్రం చేసుకోండి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు,s సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read: Bank Holidays July: జూలై నెలలో బ్యాంక్ పనులుంటే సమస్యే..16 రోజులు సెలవులు, ఇదే సెలవుల జాబితా
Also read: Pisces Monthly Horoscope 2022: ఈ రాశి వారికి ఈ నెలంతా లాభాలే.. ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook