Mosquito Repellent: దోమ కాటు వల్ల చాలా మంది అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా ఎండాకాలం, వర్షాకాలంలో సాయంత్రం పూట మురికగా ఉన్న ప్రదేశాల్లోదోమల బెడద ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల దోమ కాటుల వల్ల ప్రాణాంతక వ్యాధులైన డెంగ్యూ, మలేరియా వచ్చే ప్రమాదం అధికంగా ఉంది. ఈ రోజుల్లో దోమల బెడద నుంచి విముక్తి పొందడానికి అనేక రకాల మందులు, రసాయనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ, ఆశించిన ఫలితాలను ఇవ్వలేక పోతున్నాయి. అంతే కాకుండా ఈ రసాయనాల వల్ల వచ్చే ఫలితాలు మనుషు ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. అయితే కొన్ని మొక్కల ద్వారా కూడా దోమల నుంచి విముక్తి పొందవచ్చు. ఆ మొక్కలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తులసి మొక్క:
ప్రతి భారతీయుని ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. ఈ తులసి మొక్క ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. ఇది దోమల లార్వా, ఇతర కీటకాలను చంపడానికి  చాలా సహాయపడుతుంది. తులసి జిగుటు వాసన కలిగి ఉంటుంది. ఇది కీటకాలు, దోమలను తరిమికొడుతుంది.



గుల్ మెహందీ మొక్క:


గుల్ మెహందీని మనం రోజ్మేరీ అని కూడా పిలుస్తారు. ఈ మొక్క దోమలు, ఇతర కీటకాలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ మొక్క పువ్వులు చాలా ఘాటైన వాసన కలిగి ఉంటాయి. కావున దోమలను, కీటకాలను దూరంగా ఉంచేందుకు సహాయపడుతుంది.



పుదీనా మొక్క:


వేసవిలో ఇంట్లో తయారు చేసే దాదాపు ప్రతి వస్తువులో పుదీనాను వాడతారు. పుదీనాలోంచి వచ్చే వాసన కీటకాలను, దోమలను తరిమికొట్టడానికి పనిచేస్తుంది.
    


బంతి మొక్క:


బంతి పువ్వును ప్రతి శుభకార్యంలో వాడతారు. దీనిని ఇంగ్లీష్‌లో మేరిగోల్డ్ అంటారు. ఈ మొక్కను వివిధ జాతుల వాళ్లు వివిధ రకాలుగా పిలుస్తారు. ఈ  పువ్వులు పసుపు రంగులో ఉండడం వల్ల  ఈగలు, దోమలు, ఇతర కీటకాలను దూరం చేస్తుంది.



నిమ్మ గడ్డి మొక్క:


నిమ్మ గడ్డి మొక్క గురించి చాలా మందికి తెలుసు. ఈ మొక్క ఘాటైన వాసనతో ఉంటుంది. ఇది ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంటి నుంచి దోమలను తరిమికొట్టడానికి సహాయపడుతుంది.


Also Read: Hair found in Food: ఆహారంలో జుట్టు రావడం రాహువుకు సంకేతం..ఇలా తరుచుగా జరిగే ఆ నష్టాలు తప్పవు..!!


Also Read: Benefits Of Mulberry: వేసవిలో మల్బరీని రోజూ తింటే ఈ సమస్యలు తొలగిపోతాయి..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook