Mushroom Masala Curry: ప్రొటీన్ ఎక్కువ ఉండే మష్రూమ్ మసాలా కర్రీ ఇలా ఇంట్లో ఉండే వస్తువులతో టేస్టీగా తయారు చేయండి..
Mushroom Masala Easy Recipe: చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే ఈ అద్భుతమైన రిసిపీ ప్రతి ఒక్కరూ లొట్టలేసుకుని తినాల్సిందే. ఈరోజు మీ ముందుకు అలాంటి రిసిపీని తీసుకువస్తున్నాం అదే అదిరిపోయే మష్రూమ్ మసాలా కర్రీ. దీని రుచికి అందరూ ఫిదా అవ్వాల్సిందే.
Mushroom Masala Easy Recipe: మీరు ఎప్పుడైనా మష్రూమ్ మసాలా తిన్నారా? ఎప్పుడు ఒకేరకమైన రిసిపీ తయారు చేసి విసిగిపోయారా? అయితే, ఈ సారికి ఇలా కాస్త భిన్నంగా తయారు చేసుకోండి. రుచి అదిరిపోతుంది. ఇది చికెనా? మష్రూమా? అని కూడా అనుకుంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే ఈ అద్భుతమైన రిసిపీ ప్రతి ఒక్కరూ లొట్టలేసుకుని తినాల్సిందే. ఈరోజు మీ ముందుకు అలాంటి రిసిపీని తీసుకువస్తున్నాం. ఇది ఇప్పటి వరకు మీరు తయారు చేసుకుని ఉండరు.
మష్రూమ్ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు..
మష్రూమ్స్ -2 కప్పులు
నూనె
టమోటాలు - కట్ చేసినవి సగం కప్పు
ఉల్లిపాయలు- ఒక కప్పు కట్ చేసినవి
వెల్లుల్లి రెబ్బలు-6
అల్లం- ఒక ఇంచు
బాదం-12
పసుపు- సగం చెంచా
దాల్చిన చెక్క- ఒక ఇంచు
యాలకులు -4
కారం పొడి- ఒక చెంచా
గరం మసాలా- చెంచా
ధనియాల పొడి- అరటీస్పూన్
కసూరీ మేథీ- అర టీస్పూన్
ఉప్పు- రుచికిసరిపడా
మష్రూమ్ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా స్టవ్ ఆన్ చేసి మంట మీడియం పెట్టాలి. ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ, వెల్లుల్లి, టమోటాలు ఓ ఐదు నిమిషాల పాటు పెద్ద మంటపై వేయించుకోవాలి. దీన్ని కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయ మిక్చర్ కాసేపు చల్లారనివ్వాలి.
దీన్ని ఓ మిక్సీ జార్‌లోకి తీసుకుని మెత్తని పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మరో ప్యాన్ పెట్టి మీడియం మంటపై నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఇందులో వేసుకోవాలి. దాన్ని నూనె పైకి తేలే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంట పెద్దగా పెట్టకూడదు. లేకపోతే మసాలా మాడిపోయే ప్రమాదం ఉంది.
నూనె పైకి తేలిన తర్వాత పసుపు, గరం మసాలా, కారం పొడి, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఓ మూడు నిమిషాల తర్వాత ఒక కప్పు వేడి నీరు కూడా పోసి బాగా కలపండి. కూర బాగా ఉడకబెట్టాలి. ఆ తర్వాత జీడిపప్పు పొడి, నూనెలో వేయించిన మష్రూమ్ కూడా వేయాలి. మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత కసూరీ మేథీ కూడా వేసి మరో మూడు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇందులో కొత్తిమీరాతో పైనుంచి గార్నిష్ చేసుకోవాలి. ఈ కర్రీ చపాతీ, పుల్కాలోకి బాగుంటుంది.
ఇదీ చదవండి: కేంద్రం బంపర్ ఆఫర్.. ప్రతినెలా రూ.3000 పొందే సూపర్ హిట్ స్కీమ్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.