Skin Care Tips: చర్మ సంరక్షణ, ముఖ సౌందర్యం రెండూ చాలా అవసరం. ముఖ్యంగా వేసవిలో చర్మాన్ని పరిరక్షించడం అనేది ఓ సవాలుగా భావించాలి. రోజంతా ఎండకు ఎక్స్‌పోజ్ కావడం దుమ్ము ధూళి కారణంగా చర్మం నల్లగా మారిపోతుంటుంది. ఎప్పటికప్పుడు రాత్రి వేళ చర్మానికి కేర్ తీసుకోకపోతే పర్యవసానం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వేసవికాలంలో చర్మ సంరక్షణ చాలా అవసరం. ఎండలో బయటకు వెళ్లిన ప్రతిసారీ ముఖాన్ని ట్యాన్ కాకుండా కాపాడుకోవడం అంత సులభమేం కాదు. ఎందుకంటే ఎండలో తిరగడం, దుమ్ము ధూళికి ఎక్స్‌పోజ్ అవడం వల్ల చర్మం నల్లబడిపోతుంటుంది. స్కిన్ ట్యానింగ్ పెద్ద సమస్యగా మారిపోతుంది. ట్యానింగ్ సమస్యను దూరం చేసేందుకు మార్కెట్‌లో వివిధ రకాల క్రీమ్స్ వినియోగిస్తుంటారు. ఇవి చాలా ఖరీదైనవే కాకుండా రసాయనాలతో నిండి ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో దుష్పరిణామాలు కూడా ఎదురౌతుంటాయి. అందుకే ఈ పరిస్థితిని నివారించేందుకు కొన్ని అద్భుతమైన చిట్కాలున్నాయి. ముఖ్యంగా పాలతో అద్భుతమైన ప్రయోజనాలున్నాయంటున్నారు బ్యూటీషియన్లు. పాలలో ఉండే కొన్ని గుణాలు చర్మానికి మృదుత్వం, నిగారింపును తెచ్చిపెడుతుంది. మీరు చేయాల్సిందల్లా రాత్రి వేళ పాలతో ఫేషియల్ చేయడమే. ఎండల వేడి కారణంగా చర్మం గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పాల ద్వారా ఇది సాధ్యమే. ఎందుకంటే పాలు మీ అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. ఇందులో విటమిన్లు, బయోటీన్, పొటాషియం, కాల్షియం, ప్రోటీన్లు తగిన మోతాదులో ఉంటాయి.


మీ చర్మం మిళమిళ మెరవాలంటే, చర్మం రంగు తేలాలంటే పాలను టోనర్‌లా ఉపయోగించవచ్చు. పాలతో టోనర్ తయారు చేసేందుకు ముందుగా ఓ స్ప్రే బాటిల్‌లో పచ్చిపాలు పోయాలి. ముఖంపై స్ప్రే చేయాలి. దీంతో ముఖానికి కావల్సిన పోషకాలు కచ్చితంగా అందుతాయి. చర్మం లోపల్నించి ఆరోగ్యవంతంగా మారుతుంది. వేసవిలో చర్మం చాలా త్వరగా కందిపోతుంటుంది. ఈ సమస్యను తొలగించేందుకు క్లీన్ చేసేందుకు క్లీన్సర్ చాలా ఉపయోగపడుతుంది. పాలను క్లీన్సర్‌లా ఉపయోగిస్తే ముఖంపై ఉండే అదనపు ఆయిల్, దుమ్ము, మట్టిని తొలగించేందుకు దోహదపడుతుంది.


పాలలో సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, బయోటిన్, ల్యాక్టిక్ యాసిడ్, ప్రోటీన్లు కావల్సినంతగా ఉంటాయి. ఇవి చర్మానికి కావల్సిన పోషకాలు అందించడం వల్ల ముఖం మృదువుగా మారుతుంది. చర్మం త్వరగా హైడ్రేట్ అవుతుంది. రోజూ పాలు లేదా మీగడను మాయిశ్చరైజ్ చేయడం వల్ల మీ చర్మం నిగనిగలాడుతుంది. 


Also read: White Hair To Black Hair: తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా చేసే చిట్కాలు ఇవే, ఇవి జుట్టుకు అప్లై చేయండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook