Nautapa 2022 Do's and Dont's:  ఈ వేసవి సీజన్‌లో మార్చి నెల ప్రారంభం నుంచే ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మే నెల చివరి వారం రావడంతో ఎండల తీవ్రత మరింత పెరగనుంది. ఇవాళ్టి నుంచి జూన్ 25 వరకు 9 రోజుల పాటు ఉష్ణోగ్రతలు పీక్స్‌లో ఉంటాయి. అందుకే ఈ 9 రోజులను 'నౌతాప' అని పిలుస్తారు. నౌ అనగా తొమ్మిది, తాప అనగా సూర్యుడి తాపం అని అర్థం. ఈ 9 రోజులు భానుడు రోహిణి నక్షత్రంలో సంచరించడం కారణంగా ఎండల తీవ్రత అధిక స్థాయిలో ఉంటుంది. ఎండలు భగ భగ మండే ఈ కాలంలో కొన్ని పనులకు దూరంగా ఉండటం మంచిది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'నౌతాప'లో చేయకూడని పనులు :


నౌతాప కాలంలో తుఫాన్లు, భారీ ఈదురు గాలులు వీచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 9 రోజుల పాటు ఎలాంటి శుభకార్యాలు పెట్టుకోకపోవడం మంచిది. లేనిపక్షంలో మీతో పాటు మీ బంధువులు ఇబ్బందులు పడక తప్పదు.


నౌతాప కాలంలో సూర్యుడు భగ భగ మండిపోతుంటాడు. కాబట్టి ఈ 9 రోజులు ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోవద్దు. ప్రయాణాలు చేసేవారు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి కాలు బయటపెట్టకపోవడం ఉత్తమం. 


నౌతాపలో 9 రోజుల పాటు మసాలా తిండికి, జంక్‌ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే ఈ సమయంలో మసాలా ఫుడ్, జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ ఆరోగ్యానికి చేటు చేస్తాయి. 


ఈ 9 రోజులు మాంసం, మద్యం ముట్టుకోవద్దు. కేవలం సాత్విక ఆహారమే తీసుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. 


నౌతాపలో శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు తగినంత మంచినీరు తాగుతుండాలి. 


వీలైతే పశుపక్షాదుల కోసం నీటి తొట్టెలు ఏర్పాటు చేయండి. ఎండా కాలంలో ఎక్కడ నీరు దొరక్క అల్లాడే మూగ జీవాలకు ఇలా నీటిని అందిస్తే పుణ్యం లభిస్తుంది.


నౌతాప కాలంలో జల దానం చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం పొందుతారు. సూర్యుడు శని దేవుడి తండ్రి. సూర్య అనుగ్రహం పొందడమంటే శని బాధల నుంచి విముక్తి కావడమే. 


నౌతాప కాలంలో మొక్కలు, చెట్లు ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మొక్కలు, చెట్లకు నీళ్లు పట్టడం మరిచిపోవద్దు. 


పుచ్చకాయ, దోసకాయ, కర్బూజ, ఇలా నీరు ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోండి. తద్వారా శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది. 


(గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, ఊహలపై ఆధారపడి ఉండొచ్చు.జీ న్యూస్ దీన్ని ధ్రువీకరించలేదు.) 


Also Read: Coconut Water: వేసవిలో కొబ్బరినీళ్లు తాగితే ఈ అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు..!!


Also Read: Muskmelon: కర్బూజ పండును ఉదయాన్నే తింటున్నారా..అయితే ప్రమాదమే..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి