Best Places to Visit on New Year 2022 in India: కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవడానికి యువత సిద్ధమవుతోంది. చాలా మంది న్యూ ఇయర్ సెలబ్రెషన్స్ జరుపుకోవడానికి కొత్త ప్రదేశాలకు వెళ్తుంటారు. అయితే కరోనా కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఉన్న నేపథ్యంలో..చాలా మంది దేశీయ ప్రయాణాల వైపు మెుగ్గు చూపుతున్నారు. 2022 కొత్త సంవత్సర(New Year 2022) వేడుకలను జరుపకోవడాకి ఇండియాలో బెస్ట్ ప్లేసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాం రండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలో టాప్ 15 బెస్ట్ ప్లేసెస్:


1. గోవా(Goa)
న్యూ ఇయర్ వచ్చిందంటే..ఎక్కువ మంది వెళ్లడానికి ఇష్టపడే ప్రదేశం గోవా(goa). ఇది ఎన్నో అందమైన బీచ్లకు నిలయం. బాగా బీచ్, అంజుమ్ బీచ్, కలాంగుట్ బీచ్స్ ఫేమస్. అంతేకాకుండా బీచ్ పార్టీలు, రాకింగ్ నైట్ క్లబ్ ఈవెంట్స్, వాటర్ స్పోర్ట్స్ కు ప్రసిద్ధి. ఆకట్టుకునే రిసార్ట్స్, క్రూయిజ్ నౌక విహారం, స్పా, బార్లు, క్యాసినోలు... ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో ప్రత్యేకతలు గోవాకు ఉన్నాయి. ఎన్నో అద్భుతమైన చర్చ్ లు ఇక్కడ కొలువుదీరాయి. చపోరా పోర్ట్, దూద్ సాగర్ వాటర్ ఫాల్, సలీం అలీ బర్డ్ శాంక్చురీ కూడా పర్యాటకులను ఆకట్టుకుంటాయి. గోవాకు వెళ్లడానికి తెలుగు రాష్ట్రాల నుంచి ఫ్లైట్స్, రైళ్లు, బస్సులు అందుబాటులో ఉన్నాయి. 


2. ఊటీ(Ooty)
దేశంలో ఎక్కడా లేని ప్రశాంతత ఊటీలో దొరుకుతుంది. పార్టీలకు దూరంగా ఉండాలనుకునే వారికి బెస్ట్ ప్లేస్ ఇది. ఊటీ(Ooty) నీలగరి పర్వతాలలో ఉంటుంది. ఇక్కడ టోడా ఆదివాసీల సంప్రదాయ నృత్యం చూసి తీరాల్సిందే. ఇక్కడ టాయ్ ట్రైన్ ప్రయాణం ఎంతో మధురానుభూతిని మిగులస్తుంది. దొడబెట్ట శిఖరం, టీ  మ్యూజియం, బొటానికల్ గార్డెన్, ఫెర్న్హిల్ప్యాలెస్, ఆరన్మోర్ప్యాలెస్, వెస్ట్రన్స్టైల్చర్చ్ఇక్కడ చూడాల్సిన ముఖ్య ప్రదేశాలు. ఈ టూర్లో ఊటీ స్పెషల్టీ తాగడం  మర్చిపోకండి. 


Also Read: ఇంటర్నేషనల్ మెన్స్ డే 2021: మెన్స్ డే ఎందుకు జరుపుకుంటాం, చరిత్ర, నేపథ్యం, వాట్సాప్ మెసేజెస్, గ్రీటింగ్స్


3. పుష్కర్(Pushkar)
ఇది రాజస్థాన్ రాష్ట్రం(Rajasthan)లోని అజ్మీర్ లో గల చిన్న పట్టణం పుష్కర్. కోటలు, షాపింగ్ మాల్స్, రుచికరమైన వంటకాలకు ఇది ప్రసిద్ధి. ఒంటెలపై సఫారి చేయడం కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడ స్థానిక జీవనశైలి ఆకట్టుకుంటుంది. దేశంలో బ్రహ్మ దేవుడికి గుడి గల ఏకైక ప్రాంతం ఇది.  ఇక్కడికి వెళ్తే పుస్కర్ సరస్సు చూసి తీరాల్సిందే. ట్రెక్కింగ్, క్యాంపింగ్ లేదా బ్యాక్ప్యాకింగ్ చేసేవాళ్లకు ఇది మంచి ప్రదేశం. 


4. వారణాసి(Varanasi)
ఆధ్యాత్మికత అనుభూతిని అనుభవించాలంటే ఉత్తరప్రదేస్(UP)లో గల వారణాసిని సందర్శించాల్సిందే. ఇక్కడ సంస్కృతి, సంప్రదాయాలు మనల్ని కట్టిపడేస్తాయి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది. విశాలాక్షి ఆలయం, కాల భైరవాలయం, దుర్గా మాత దేవాలయం, భారతమాత మందిరం వంటి ఆలయాలు ఇక్కడ కొలువుదీరాయి.  దశాశ్వమేథ ఘట్టం, హరిశ్చంద్ర ఘట్టం వంటి పలు స్నాన ఘట్టాలున్నాయి. గంగానదిలో పడవ ప్రయాణం చాలా బాగుంటుంది. 


5. పాండిచ్చేరి(Pondicherry)
తక్కువ బడ్జెట్ లో ప్రయాణించాలనుకునేవారికి ఇది బెస్ట్ ప్లేస్. ఇక్కడ అంతా ఫ్రెంచ్ స్టైల్ కనిపిస్తోంది. బీచ్ ల్లో బైకింగ్ చేయడం చాలా ఫేమస్. శ్రీ అరబిందో ఆశ్రమం, ప్రొమెనేడ్ బీచ్, హెరిటేజ్ వాక్, విట్ ఫ్రెంచ్ కాలనీ చూడాల్సిన ప్రదేశాలు. ఇక్కడ బ్యాక్ వాటర్స్ చూడవచ్చు. పాండిచ్చేరి(Pondicherry)కి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా విమానాలు ఉన్నాయి. అదే విధంగా విశాఖపట్నం, హైదరాబాద్ నుంచి రైలు  సౌకర్యం కూడా ఉంది. 


6.గోకర్న(Gokarna)
ఇది కర్ణాటక రాష్ట్రం(Karnataka)లో ఉంది. ఇక్కడి బీచ్ లు  మనల్ని కట్టిపడేస్తాయి. ఇది గోవాకు చాలా దగ్గర గల ప్లేస్. బీచ్ హోపింగ్, హైకింగ్, బోట్ ట్రిప్ చాలా ఫేమస్. ఇక్కడ కేవ్స్ చాలా ఉన్నాయి. ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్. 


7. లక్షద్వీప్(Lakshadweep)
కేరళ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో ఉండే ప్రాంతం లక్షద్వీప్. ఇక్కడ 36 దీవులు ఉన్నాయి.  ఇది పగడపు దిబ్బలకు ఎంతో ప్రసిద్ధి. రాజధాని కవరత్తి చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటి. బంగరమ్, కడమట్ ద్వీపాలు పర్యటకులు మెచ్చే ప్రదేశాలు. స్కూబాడైవింగ్, విండ్ సర్ఫింగ్, సర్ఫింగ్, కయాకింగ్, కేనోయింగ్, వాటర్ స్కీయింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్ కు ఫేమస్. ఇక్కడ సీ పుడ్ చాలా బాగుంటుంది. ఇక్కడ వెళ్లాలనుకునే వారు ముందుగా కేరళ(Kerala) చేరుకుని..అక్కడి నుంచి షిప్ లో లక్షదీవులకు చేరుకోవచ్చు. 


Also Read: The Boiling River: సలసలకాగే నదిని ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా


8. కొడైకెనాల్(Kodaikanal)
కొత్తగా పెళ్లెయిన జంటలు న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవడానికి ఇది బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి. కొడైకెనాల్ లేక్ లో బోటింగ్ చాలా బాగుంటుంది. సిల్వర్ క్యాస్కేడ్ ఫాల్స్, బ్రయంట్ పార్కు చూడాల్సిన ప్రదేశాలు. సైక్లింగ్, హార్స్ రైడింగ్, ట్రెక్కింగ్ వంటి అడ్వెంచర్స్ ఇక్కడ చేయవచ్చు. ఇక్కడకు వెళితే కాఫీ(Coffee) రుచి చూడటం మరచిపోకండి. 


9. మనాలి(Manali)
ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో వెళ్లడానికి మంచి ప్లేస్ మనాలి. ఇది హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) రాష్ట్రంలో ఉంది. సాహస క్రీడలకు ప్రసిద్ధి మనాలి. స్కీయింగ్, హైకింగ్, పారా గ్లైడింగ్, రాఫ్టింగ్, ట్రెక్కింగ్, కయకింగ్ (పడవ), మౌంటైన్ బైకింగ్ వంటి వాటికి పేరు పొందింది. యాక్ స్కీయింగ్ ఈ ప్రాంతపు ప్రత్యేక క్రీడ. మనాలిలో మనికరణ్ వేడి నీటిబుగ్గలు, హిడింబా దేవి ఆలయం, రహ్లా వాటర్ ఫాల్స్, సోలంగ్ లోయ, రోహతంగ్, టిబెటన్ మొనాస్టరీ, వాన్ విహార్, వశిష్ట్ టెంపుల్, మాల్ రోడ్ చూడాల్సిన ప్రదేశాలు. ఏడాది పొడవునా పర్యాటకులతో కిక్కిరిసి పోయే ప్రాంతం మనాలి. 


10. గుల్మార్గ్(Gulmarg)
ప్రకృతి ఒడిలో నూతన సంవత్సర వేడుకలు చేసుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్. ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. ఇది జమ్మూకశ్మర్(Jammu and Kashmir)లోని ఒక పట్టణం. భారతదేశంలో శీతాకాలపు క్రీడల నిర్వహించే ఏకైక ప్రదేశం ఇది. స్కీయింగ్, టోబోగానింగ్, స్నోబోర్డింగ్ మరియు హెలీ-స్కీయింగ్ క్రీడలకు ప్రసిద్ధి. మహారాణి టెంపుల్, సైయింట్ మేరీ చర్చ్, గుల్మార్గ్ గండోలా చూడాల్సిన ప్రదేశాలు. 


11. ఉదయ్ పూర్(Udaipur)
ఇది రాజస్థాన్ లో గలదు. దీనిని సరస్సుల నగరం, సిటీ ఆఫ్ సన్ సెట్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ రాజభవనాలు, ప్రజల జీవన విధానం సందర్శకులను కట్టిపడేస్తాయి. ఉదయపూర్ సిటీ ప్యాలెస్, జల మందిరం, జగ్ మందిర్, లేక్ ప్యాలెస్, ఫతే సాగర్ సరస్సు, పిచోలా సరస్సు, మహారాణా ప్రతాప్ మెమోరియాల్, నెహ్రూ ఉద్యానవనం, అహర్ మ్యూజియమ్, శిల్ప్ గ్రామ్, ఉదయ్పూర్ సోలార్ అబ్జర్వేటరీ, నీమాచ్ మాతా ఆలయం ఇక్కడ చూడాల్సిన బెస్ట్ ప్లేసెస్. ఉదయ్ పూర్ కు సమీపంలో ఉన్న ప్రఖ్యాత వేసవి విడిది మౌంట్ అబూ(Mount Abu). 


12. బెంగళూరు(Bangalore)
ఇండియా ఐటీ రాజధాని బెంగళూరు(Bangalore). ఇక్కడ పార్టీ, పబ్ కల్చర్ బాగుంటుంది. బెంగళూరు సిటీ చూడటానికి చాలా బాగుంటుంది. పెద్దపెద్ద హోటల్స్, రిసార్ట్స్ , లాంజర్ లు ఉంటాయి. బన్ఘట్ట నేషనల్ పార్క్, బెంగుళూరు ప్యాలెస్ ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు. 


13. న్యూఢిల్లీ(New Delhi)
దేశ రాజధాని న్యూఢిల్లీ లో న్యూ ఇయర్ వేడుకలు అద్భుతంగా ఉంటాయి. ఫుడ్ వాక్, ఓల్డ్ ఢిల్లీలో హిస్టారికల్ వాక్, సౌత్ ఢిల్లీలో నైట్ లైఫ్ చాలా బాగుంటుంది. ఢిల్లీ(Delhi)లోని ప్రత్యేకమైన నైట్క్లబ్లలో మీరు ఎంజాయ్ చేసి తీరాల్సిందే. హౌజ్ ఖాస్, కన్నాట్ ప్లేస్, గ్రేటర్ కైలాష్ లు థీమ్ పార్టీలకు ఫేమస్.


14. ముంబయి(Mumbai)
డ్రీమ్ సిటీ గా పిలిచే మంబై(Mumbai) ఎప్పుడూ పార్టీలు, నైట్ క్లబ్ లతో కిక్కిరిసిపోయి ఉంటుంది. కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి ఇది బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి. ఇక్కడికి వెళ్తే...మెరైన్ డ్రైవ్, గేట్వే ఆఫ్ ఇండియాను తప్పక సందర్శించాల్సిందే. షాపింగ్ చేసుకోవడానికి ఇది అనువైన ఫ్లేస్. హాజీ అలీ దర్గా చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటి. 


15. గ్యాంగ్ టక్(Gangtok)
ఈ నగరం 5,410 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రకృతి మనల్ని కట్టి పడేస్తుంది. ఇక్కడ సూర్యాస్తమయం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. గురుడోంగ్మార్ లేక్, హనుమాన్ టోక్, నామ్గ్యాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీ సందర్శించాల్సిన ప్రదేశాలు. ఈ ప్రాంతం హౌస్ పార్టీలు, సాహసాలు, క్లబ్బింగ్, బార్ హోపింగ్ చేయడానికి బాగుంటుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook