Strange Village: ఈ ఊరిలో ఆడవాళ్లే లేరు.. అందరూ మగవాళ్లే.. ఎందుకో తెలుసా..?
మన దేశంలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి. అక్కడ ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. వింత ఆచారాలను అనుసరిస్తూ ఉంటారు. ఈరోజు మనం చెప్పుకోబోయే గ్రామం కూడా అలాంటిదే. ఈ ఊరు ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రామంలో స్త్రీలే ఉండరు. కేవలం పురుషులు మాత్రమే అక్కడ జీవిస్తారు. దీనికి ప్రధానం కారణం ఏంటి? ఈ వింత గ్రామం ఎక్కడుందో తెలుసుకుందాం.
Strange Village: మన దేశంలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి. అక్కడ ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. వింత ఆచారాలను అనుసరిస్తూ ఉంటారు. ఈరోజు మనం చెప్పుకోబోయే గ్రామం కూడా అలాంటిదే. ఈ ఊరు ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రామంలో స్త్రీలే ఉండరు. కేవలం పురుషులు మాత్రమే అక్కడ జీవిస్తారు. దీనికి ప్రధానం కారణం ఏంటి? ఈ వింత గ్రామం ఎక్కడుందో తెలుసుకుందాం.
ఈ గ్రామంలో కేవలం పురుషులు మాత్రమే ఉంటారు. స్త్రీలు అస్సలు ఉండరు. ఇది ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం. ఈ ఊరు బిహార్ రాష్ట్రంలోని బర్వాన్ కాలా. ఈ గ్రామం కైమూర్ హిల్స్ లో ఉంది. ఈ గ్రామంలో స్త్రీలు ఉండకపోవడానికి ప్రధానం కారణం ఇక్కడి పురుషులకు పెళ్లి ఇష్టం లేదా? ఎందుకు ఈ ఆచారం కొనసాగుతుందంటే.. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 50 ఏళ్ల నుంచి ఈ వింత ఆచారం ఉంది. ఇన్నేళ్లలో ఒక్క మహిళ కూడా ఇక్కడి మగవాళ్లను పెళ్లిచేసుకోవడానికి ముందుకు రాలేదు.
దీనికి ప్రధాన కారణం కైమూర్ కొండల్లో ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది ఈ బర్వాన్ కాలా గ్రామం. ఇక్కడ అన్ని రాళ్లురప్పలు అడవిని పోలి ఉంటుంది. ఈ ఊరుకు చేరుకోవాలన్నా ఈ మార్గం గుండానే చేరుకోవాల్సి ఉంటుంది. అచ్చం అడవిలా ఉంటుందట ఈ గ్రామానికి చేరుకునే మార్గం. దీనికి ఈ మార్గమే ఉంది. అందుకే ఏ మహిళ ఇక్కడికి రావాలని కోరుకోదు. ఇక్కడి యువకులను పెళ్లిచేసుకోవడాన్ని ఇష్టపడరు. ఏ తల్లిదండ్రులు కూడా ఈ గ్రామానికి తన కూతుళ్లను ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడరట. అందుకే ఈ గ్రామంలో కేవలం పురుషులే ఉంటారు. అయితే, ఈ రికార్డును ఓ యువకుడు బద్దలు కొట్టాడు. 2017లో ఈ గ్రామానికి చెందిన ఓ యువకుడు ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ గ్రామానికి తీసుకువచ్చాడట.(Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)
ఇదీ చదవండి: బాలరాముని దర్శనానికి భారీ రద్దీ.. ఆలయ సమయంలో మార్పులు.. కొత్త షెడ్యూల్ ఇదే...
ఇదీ చదవండి: EPFO Balance Check: UAN నంబర్ తో సంబంధం లేకుండా ఇలా సింపుల్ గా పీఎఫ్ బ్యాలన్స్ చెక్ చేసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook