Potato Fry: బంగాళాదుంప ఫ్రై చేసుకోండి ఇలా!
Spicy Potato Fry Recipe: ఆలుతో తయారు చేసే వంటలను చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే బంగాళాదుంపలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. ఇందులో ఆలు ఫ్రై కూడా ఒకటి. అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం.
Spicy Potato Fry Recipe: సైడ్ డిష్ గా తినడానికి ఆలు ఫ్రై చాలా బాగుటుంది. ఈ ఆలూ ఫ్రై పొడి పొడిగా, క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఇది ఎలా తయారు చేసుకోవాలి.. అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ ఫ్రైకి కావల్సిన పదార్థాలు:
బంగాళాదుంపలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కారం తగినంత, నూనె, పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ , కరివేపాకు, పసుపు, ఉప్పు తగినంత.
తయారీ విధానం: బంగాళాదుంపలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. కళాయిలో ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే కారం కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత పాన్‌లో నూనె వేడి చేసి బంగాళాదుంప ముక్కలను వేసి వేయించాలి. ఇవీ క్రిస్పీగా అయ్యే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మరో కళాయిలో నూనె పోసి జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి.
Also read: Cauliflower Avakaya:రుచికరమైన క్యాలీప్లవర్ ఆవకాయ చేసుకోండి ఇలా!
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, పసుపు వేసి కలపాలి. వేయించిన బంగాళాదుంప ముక్కలు వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ ఫ్రై తయారవుతుంది.
Also read: Makar Sankranti Foods: మకర సంక్రాంతి రోజున తప్పకుండా తినాల్సిన పిండి వంటలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter