Oats Masala Vada Recipe: ఆరోగ్యాన్ని పెంచే ఓట్స్ మసాలా వడ రెసిపీ..
How To Make Oats Vada Recipe: ఓట్స్‌తో వివిధ రకాల రెసిపీలను తయారు చేసుకోవచ్చు. వీటిని మసాలా వడలు లాగా కూడా తయారు చేసుకోవచ్చు. అయితే వీటిని ఎలా తయారు చేసుకోవాలో, వీటికి కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Oats Masala Vada Recipe: ఓట్స్ మన శరీరానికి ఎంతో మంచివి. ఇందులో ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి బరువు, కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలనుకునేవారు ప్రతి రోజు ఉదయం ఆల్పాహారంలో భాగంగా ఓట్స్‌ను తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని స్ట్రాంగ్ చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే చాలా మంది ఉదయం తీసుకునే ఓట్స్‌తో వివిధ రకాల రెసిపీలను తయారు చేసుకుంటున్నారు. కొంతమంది వీటిలో బజ్జీలు తయారు చేసుకుంటే, మరికొంతమంది రోటీలు, దోశలు వేసుకుంటున్నారు. అయితే వీటన్నింటినీ తిని తిని బోర్ కొడుతున్నవారికి ఈ రోజు కొత్త రెసిపీని పరిచయం చేయబోతున్నాం. ఓట్స్‌తో సులభంగా మసాలా వడలను కూడా తయారు చేసుకోవచ్చు. అయితే వీటిని ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్స్ మసాలా వడ రెసిపీకి కావాల్సిన పదార్థాలు:
ఓట్స్ - 1 కప్పు
పెరుగు - 1/3 కప్పు
బియ్యం పిండి - 1/2 కప్పు
ఉప్పు - రుచికి తగినంత
మిరియాల పొడి - రుచికి తగినంత
పచ్చిమిర్చి - 2 (తురమాలి)
అల్లం - అంగుళం (తురమాలి)
నూనె - డీప్ ఫ్రై చేయడానికి
తయారీ విధానం:
ముందుగా ఈ ఓట్ వడాలను తయారు చేసుకోవడానికి ఓట్స్‌ను మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఒక గిన్నెలో గ్రైండ్ చేసిన ఓట్స్ పిడిని, పెరుగు, బియ్యం పిండి, ఉప్పు, మిరియాల పొడి, పచ్చిమిర్చి, అల్లం వేసి బాగా కలపాలి.
పిండి చాలా గట్టిగా లేదా పలుచగా ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీరు లేదా పెరుగు వేసుకోవచ్చు.
ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని 10 నిమిషాలు పక్కన పెట్టాలి.
ఆ తర్వాత ఒక పాన్‌లో నూనె వేడి చేయాలి.
పిండిని చిన్న చిన్న వడలుగా చేసి నూనెలో వేయాలి.
వడలు బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు డీప్ ఫ్రై చేయాలి.
వేడి వేడిగా టమాటా సాస్ లేదా కొబ్బరి చట్నీతో కలిపి సర్వ్ చేయాలి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
చిట్కాలు:
ఓట్స్‌ను మరింత మెత్తగా గ్రైండ్ చేస్తే వడలు మరింత మృదువుగా వస్తాయి.
పిండిలో కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి కూడా చేసుకోవచ్చు.
వడలను ఎక్కువ సేపు నూనెలో వేయించకుండా జాగ్రత్త వహించాలి. లేకపోతే అవి గట్టిగా మారిపోతాయి.
నూనె పీల్చుకోకుండా ఉండటానికి చిట్కాలు:
ఓట్స్‌ను బాగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది.
పిండిలో పెరుగు వేయడం వల్ల వడలు మృదువుగా ఉండటమే కాకుండా నూనెను కూడా తక్కువగా పీల్చుకుంటాయి.
వడలను ఎక్కువ సేపు నూనెలో వేయకుండా జాగ్రత్త వహించాలి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి