Oats Upma: బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ఉప్మా తింటే బోలెడు లాభాలు.. ఇంతకీ ఈ ఉప్మా ఏంటి?
Oats Upma In Telugu: ప్రతి రోజు ఓట్స్ ఉప్మా తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి. అంతేకాకుండా శరీరాన్ని శక్తివంతంగా తయారు చేస్తుంది.
Oats Upma In Telugu: బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్‌తో తయారు చేసిన ఉప్మా తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఓట్స్‌తో తయారు చేసిన ఉప్మా తినడం వల్ల మరిన్ని లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. ఇది దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు డైట్‌లో భాగంగా ఈ ఉప్మాను చేర్చుకోడం వత్త మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. అయితే మీరు కూడా ఇంట్లోనే సులభంగా ఓట్స్ ఉప్మాను తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా తయారు చేసుకోండి.
కావలసిన పదార్థాలు:
1 కప్పు ఓట్స్
1/4 టీస్పూన్ ఆవాలు
1/4 టీస్పూన్ జీలకర్ర
1/4 టీస్పూన్ సెనగపప్పు
1/4 టీస్పూన్ మినపప్పు
కొంచెం అల్లం ముక్క
2 పచ్చిమిరపకాయలు
1 ఉల్లిపాయ
కరివేపాకు
1 టమాట
1/4 టీస్పూన్ పసుపు
సరిపడా ఉప్పు
మీ ఇష్టమైన కూరగాయలు (క్యారెట్, బీన్స్ మొదలైనవి)
కోతిమీర
నిమ్మరసం
నూనె
తయారీ విధానం:
కూరగాయలను ఇలా కట్ చేసుకోండి: ముందుగా ఉల్లిపాయ, టమాటోలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, బీన్స్ లను నీటిలో వేసుకుని బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
పోపు తయారీ: బాగా శుభ్రం చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి పోపుకు సరిపడా నూనె వేసి, కాస్త వేడక్కనివ్వాలి.. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, సెనగపప్పు, మినపప్పు వేసి వేగించాల్సి ఉంటుంది.
కూరగాయలు వేయించండి: ఆ తర్వాత పోపులోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి బాగా వేయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోండి.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
మిగతా పదార్థాలు వేసి ఉడికించండి: దోరగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు, కట్ చేసుకున్న క్యారెట్, బీన్స్ ముక్కలు, టమాట ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకుని తక్కువ మంటపై వేయించుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత కూరగాయలన్నీ బాగా మగ్గిన తర్వాత ఒక కప్పు ఓట్స్‌కి ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి మూత పెట్టి బాగా మరిగించాల్సి ఉంటుంది. నీరంతా పీల్చేదాకా సన్నని సెగపై ఉడికించాల్సి ఉంటుంది.
చివరిలో సన్నగా కట్ చేసుకున్న కోతిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక ప్లేట్‌లో ఓట్స్ ఉప్మా వేసుకుని నిమ్మరసం పిండి సర్వ్ చేయండి.
చిట్కాలు:
ఈ ఓట్స్ ఉప్మా రుచిని పెంచుకోవడానికి ఓట్స్ ఉప్మాలో వేరుశెనగలు, బాదం ముక్కలు కూడా వేయవచ్చు.
ఓట్స్ ఉప్మాను వేడి వేడిగా సర్వ్ చేసుకుని తింటే మంచి లాభాలు పొందుతారు.
ఓట్స్ ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు అధిక మోతాదులో లభిస్తాయి.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.