Oil For Beard Growth In 10 Days: ప్రస్తుతం గడ్డం పెంచుకోవడం ట్రెండ్‌గా మారింది. ప్రతి అబ్బాయి అందాన్ని రెట్టింపుగా చేసుకోవడానికి పొడవుగా గడ్డాన్ని పెంచుకుంటున్నారు. అయితే పొడవుగా గడ్డం పెంచుకునే క్రమంలో చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా చాలా మందిలో ఎలాంటి గ్రోత్‌ లేక గడ్డం పెరగడం లేదు. అయితే గడ్డాన్ని ఒత్తుగా, పొడవుగా పెంచుకోవడానికి తప్పకుండా పలు రకాల చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ఆ చిట్కాలను పాటించడం వల్ల గడ్డం ఒత్తుగా తయారు కావడమేకాకుండా గడ్డానికి సంబంధించిన అన్ని రకాల చిట్కాలు దూరమవుతాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గడ్డం గ్రోత్‌ కోసం ప్రస్తుతం మార్కెట్‌లో చాలా రకాల రసాయనాలతో కూడిన ఉత్పత్తులు లభిస్తాయి. అయితే వీటిని వినియోగించడం వల్ల దుష్ప్రభావాలు కలగడమేకాకుండా తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. థిక్‌ గడ్డాన్ని పొందడానికి బాదం నూనెను ప్రతి రోజూ వినియోగించాల్సి ఉంటుంది. దీనిని ప్రతి రోజూ వినియోగించడం వల్ల గడ్డం పెరగడమేకాకుండా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.


బాదం నూనె వల్ల కలిగే ప్రయోజనాలు:
బాదం నూనెలో విటమిన్ ఇ, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా లభిస్తాయి. అయితే ప్రతి రోజు బాదం నూనెను గడ్డానికి అప్లై చేస్తే సులభంగా పెరుగుతుంది. అంతేకాకుండా దీనిని జుట్టుకు అప్లై చేయడం వల్ల కూడా సులభంగా జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.


గడ్డం పెరగాలంటే బాదం నూనెను ఇలా రాయండి:
1 గిన్నెలో 1 స్పూన్ బాదం నూనె తీసుకోండి.
తర్వాత అందులో 1 టీస్పూన్ జోజోబా ఆయిల్ వేయాలి.
రెండింటినీ మిక్స్ చేసి తేలికగా వేడి చేయాలి.
ఇప్పుడు గడ్డం ఉన్న ప్రదేశంలో అప్లై చేసి మసాజ్ చేయాలి.
4-5 నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత, 20 నిమిషాలు అలాగే ఉంచండి.
దీని తర్వాత మీరు మీ ముఖాన్ని శుభ్రమైన నీటితో కడగాలి.
రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకుని రాత్రంతా అలాగే ఉంచాలి.
ఇలా క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల సులభంగా మంచి ఫలితాలు కలుగుతాయి.


Also Read:  Ram Charan Birthday : టాలీవుడ్ మొత్తం చిరంజీవి ఇంట్లోనే.. చెర్రీ బర్త్ డేకు దూరంగా నందమూరి ఫ్యామిలీ?


Also Read: Upasana Baby Bump Pics : రామ్ చరణ్‌ బర్త్ డే వేడుకలు.. ఉపాసన బేబీ బంప్ పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook