Oily and Greasy Hair: ఏం చేసిన జుట్టు మురికిగానే ఉంటోందా? శీతాకాలంలో ఇలా చేయండి!
Oily and Greasy Hair: శీతాకాలంలో జుట్టు సమస్యలు రావడం సాధరణం. అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి ప్రతి రోజు జుట్టును శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల చిట్రాలు కూడా వినియోగించాల్సి ఉంటుంది.
Oily and Greasy Hair: శీతాకాలంలో వాతావరణంలో మార్పులు రావడం కారణంగా జుట్టు సమస్యలతో పాటు చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవారిలో తరచుగా మొటిమల సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఈ సమయంలో జుట్టుతో పాటు చర్మంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో చాలా మందిలో జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా వస్తాయి. ఈ సమస్యలు ఉన్నవారు రసాయనాలతో కూడిన హెయిర్ ప్రోడక్ట్స్‌ను కూడా వినియోగించకపోవడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. అయితే జుట్టు, చర్మ సమస్యలతో బాధపడేవారు శీతాకాలంలో ఆయుర్వేద గుణాలు కలిగిన ప్రోడక్ట్స్ వినియోగించడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. చలి తీవ్రత కారణంగా మురికి జుట్టు ఏర్పడి ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మురికి జుట్టు వల్ల సమస్య కారణంగా వచ్చే సమస్యలు:
మొటిమలు:
మురికి జుట్టు కారణంగా నుదిటితో పాటు వీపు, మెడపై మొటిమల సమస్యలు వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. జుట్టులో పేరుకుపోయిన మురికి, నూనె మీ చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తాయి. అంతేకాకుండా తీవ్ర జుట్టు సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి.
స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్:
జుట్టులో పేరుకుపోయిన నూనె, దుమ్ము కారణంగా స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్‌తో పాటు అనేక రకాల చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా కొందరిలో జుట్టు చిట్లడం, చుండ్రు వంటి సయస్యలు కూడా వస్తాయి.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
చర్మపై దద్దుర్లు:
జుట్టులో పేరుకుపోయిన మురికి ప్రభావం నేరుగా ముఖంపై పడే ఛాన్స్‌లు ఉన్నాయి. దీని వల్ల చర్మంపై దద్దుర్లు, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. వెంట్రుకల్లో పేరుకుపోయిన కాలుష్య కారకాలు చర్మంతో కలిసిపోయి బ్యాక్టీరియా, ఫంగస్ వృద్ధి చెందుతాయి. దీని కారణంగా చర్మంపై దద్దుర్లు, ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.
ఈ సమస్యల నుంచి ఇలా ఉపశమనం పొందండి:
ప్రస్తుతం చాలా మంది శీతాకాలంలో వర్కవుట్ చేస్తారు. దీని కారణంగా కొందరిలో చెమట జుట్టులోకి వెళ్లి మురికిగా తయారవుతుంది. కాబట్టి ప్రతి రోజు వాకింగ్ చేసిన తర్వాత తప్పకుండా తల స్నానం చేయాల్సి ఉంటుంది.
క్రమం తప్పకుండా యాంటీ డాండ్రఫ్ షాంపూను వినియోగించాల్సి ఉంటుంది. దీని కారణంగా చుండ్రుతో పాటు ఇతర సమస్యలు కూడా దూరమవుతాయి.
ముఖ్యంగా చుండ్రు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆయుర్వేద గుణాలు కలిగిన యాంటీ-డాండ్రఫ్ షాంపూని వినియోగించాల్సి ఉంటుంది.
మురి జుట్టు ఉన్నవారు తప్పకుండా ప్రతి రోజు తల స్నానం చేయడం చాలా మంచిది. అంతేకాకుండా రసాయనాలతో కూడిన ప్రోడక్టులను వినియోగించడం మానుకోవాలి.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి