Okra Water For Diabetes: ఓక్రా వాటర్ లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. అంతేకాకుండా బాడీ ని హైడ్రేట్ గా కూడా  ఉంచుతుంది. ఇందులో ఉండే గుణాలు జీర్ణ వ్యవస్థను మెరుగు పరచడమే కాకుండా అన్ని రకాల వ్యాధులను నయం చేస్తుంది. అందుకే చాలామంది వివిధ అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఈ వాటర్ ను వినియోగిస్తారు. ఇందులో ఉండే గుణాలు పలు ప్రాణాంతక సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఓక్రా వాటర్‌ను అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఏవిధంగా ఉపయోగించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వాటర్‌ను ఎలా తయారు చేసుకోవాలి..?:
ఈ బెండకాయల నీటి ని తయారు చేయడానికి ముందుగా.. ఒక ఐదు నుంచి ఆరు బెండకాయలను తీసుకొని వాటిని కట్ చేసి గ్లాసు నీటిలో నానబెట్టాలి. రాత్రంతా నానబెట్టిన తర్వాత ఆ బెండకాయల నుంచి రసం బయటికి వస్తుంది. దానిని తీసుకొని ఓ బౌల్లో వేసి కొద్దిసేపు మరిగించాలి. ఇలా మరిగించడం వల్ల అందులోని పోషక విలువలు రెట్టింపు అవుతాయి. కాబట్టి తీసుకునే ముందు తప్పకుండా మరిగించాలని చెబుతున్నారు.


ఓక్రా వాటర్ లో గుండెను ఆరోగ్యంగా ఉంచే పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే వారికి ఈ వాటర్ ప్రభావంతంగా పనిచేస్తుంది. రక్తంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ సులభంగా నియంత్రించేందుకు సహాయపడుతుంది. 


ముఖ్యంగా మధుమేహం వ్యాధితో బాధపడుతున్న వారికి ఔషధంలా పనిచేస్తుంది. అయితే ఈ వాటర్ ను మధుమేహంతో బాధపడుతున్న వారు రోజుకి రెండు పూటలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా రక్తంలోని చక్కర పరిమాణాలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


ఓక్రా వాటర్ లో విటమిన్ కె అధిక పరిమాణంలో లభిస్తుంది. ఇది రక్తస్రావాన్ని తగ్గించడానికి ప్రభావంతంగా పనిచేస్తుంది. ఇందులో ఐరన్ పరిమాణం అధిక మొత్తంలో లభిస్తుంది కాబట్టి ఈ నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ కోరత వంటి సమస్యలు తగ్గుతాయి.


అలర్జీ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ నీటిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా చర్మ సమస్యలు కూడా దూరం అవుతాయి కాబట్టి చర్మ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ నీరు ను తీసుకోవాలి.


Also read: Munugodu bypolls 2022: మునుగోడు ఉపఎన్నికకు నేటి నుంచే నామినేషన్లు 


Also read: Indian Airforce Day: ప్రతి సంవత్సరం ఎయిర్ ఫోర్స్ డేను ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook