One Rupee Coin: మీ దగ్గర ఆ కాయిన్ ఉందా, ఉంటే పది కోట్లు సాధించవచ్చు మరి
One Rupee Coin: జీవితంలో మనం చేసుకునే కొన్ని అలవాట్లు కావచ్చు, హాబీలు కావచ్చు ఒక్కోసారి భారీ అదృష్టాన్నే తెచ్చిపెడుతుంటాయి. అనుకోకుండా కోట్ల రూపాయల్ని తెచ్చిపెడుతుంటాయి. అటువంటి ఘటనే జరిగింది. అదేంటో పరిశీలిద్దాం.
One Rupee Coin: జీవితంలో మనం చేసుకునే కొన్ని అలవాట్లు కావచ్చు, హాబీలు కావచ్చు ఒక్కోసారి భారీ అదృష్టాన్నే తెచ్చిపెడుతుంటాయి. అనుకోకుండా కోట్ల రూపాయల్ని తెచ్చిపెడుతుంటాయి. అటువంటి ఘటనే జరిగింది. అదేంటో పరిశీలిద్దాం.
కొంతమందికి పాత నాణేలు, పాత నోట్లను సేకరించే అలవాటు ఉంటుంది. ఎక్కడ ఏ మూలన ఉన్నా..వాటిని భద్రపర్చుతుంటారు. ఇలా సేకరించి భద్రపర్చుకునేవారు కొంతకాలానికి అమ్ముకుంటారు. మరి కొందరైతే అలాగే కలకాలం దాచుకుంటారు. ఇంకొందరైతే ఎంత ధరైనా చెల్లించి ఇతరుల్నించి కొనుగోలు చేస్తుంటారు. అందుకే పాత నాణేలు(Old Coins), పాత నోట్లు ఉంటే భద్రపర్చుకోండి. ఎందుకంటే ఏదో ఓరోజు అవి మీకు కోట్ల రూపాయలు తెచ్చిపెడతాయి. ఆ ఘటన గురించి తెలుసుకుందాం.
1885లో బ్రిటీష్(British times coin) పాలకులు దేశాన్ని పాలిస్తున్న సమయం. ఆ సమయంలో జారీ చేసిన 1 రూపాయి నాణెం. ఇటీవల ఓ వెబ్‌సైట్ నిర్వహించిన వేలంపాటలో ఈ నాణెం కోట్లు పలికింది. ఓ వ్యక్తి అపురూపంగా దాచుకున్న నాణేన్ని వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టాడు. వేలంలో మరోవ్యక్తి ఏకంగా పది కోట్ల రూపాయలకు కొనుగోలు చేశాడు. కేవలం ఒకే ఒక్క రూపాయి నాణెం కోటీశ్వరుడిని చేసింది. ఆన్‌లైన్‌లో కోట్ల రూపాయలకు అమ్ముడై అతనికి ఊహించని సంపదను తెచ్చిపెట్టింది. నమ్మడానికి వింతగా ఉన్నా నమ్మక తప్పని విషయమిది. గతంలో కూడా అంటే జూన్ నెలలో 1933 నాటి యూఎస్ నాణెం న్యూయార్క్‌లో జరిగిన ఓ వేలంలో 188 కోట్లకు అమ్ముడైంది. కొన్ని నిజాలిలానే ఉంటాయి. నమ్మాల్సిందే. మీ దగ్గర కూడా పాత నోట్లు(Old Notes), నాణేలుంటే సేకరించడం అలవాటు చేసుకోండి. ఎప్పుడైనా సరే అవి మీకు కోట్లు కురిపిస్తాయి.
Also read: Honeymoon Destinations: ఇండియా టాప్ 6 హానీమూన్ ప్రాంతాలు, ఎంత ఖర్చవుతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook